epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

చొప్పదండిని బీజేపీకి అప్పగించండి

చొప్పదండిని బీజేపీకి అప్పగించండి
అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం
మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్–బీఆర్ఎస్‌కు గుణపాఠం తప్పదు
పట్టణాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం :
బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి

కాకతీయ, కరీంనగర్ : చొప్పదండి మున్సిపాలిటీని బీజేపీకి అప్పగిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని, పట్టణ రూపురేఖలనే మార్చేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. చొప్పదండి బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన బైక్ ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్సిపాలిటీల అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం, నేటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీల అభివృద్ధి విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని గంగాడి కృష్ణారెడ్డి విమర్శించారు. పట్టణాలు వెనుకబాటుకు గురవడానికి ఈ రెండు పార్టీల పాలనలే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా మున్సిపాలిటీల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు కూడా కేంద్ర ప్రభుత్వ 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల కోసమే నిర్వహిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

కేంద్ర ప్రభుత్వంతోనే పట్టణాల పురోగతి

2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ఆ దిశగా అమృత్ పథకాలలో పట్టణాలను చేర్చడంతో పాటు, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు స్మార్ట్ సిటీ హోదా కల్పించిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే మున్సిపాలిటీల అభివృద్ధి జరుగుతోందని, కరీంనగర్ స్మార్ట్ సిటీకి వేల కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు. పట్టణాల ముఖచిత్రాన్ని మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేసిన గంగాడి కృష్ణారెడ్డి.. కేంద్ర మంత్రుల సహకారం, కేంద్ర నిధులతో పట్టణాల అభివృద్ధి బాధ్యతను బీజేపీ స్వయంగా తీసుకుంటుందని అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలపై ప్రజలు విసిగిపోయారని, ప్రస్తుతం ప్రజలంతా బీజేపీ వైపు ఆశతో చూస్తున్నారని అన్నారు. కరీంనగర్ జిల్లాలోని మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్‌పై కూడా కాషాయ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.