epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఈసారి హంగ్ మానే..!

ఈసారి హంగ్ మానే..!
కరీంనగర్ కార్పొరేషన్‌లో టైట్ ఫైట్
కాంగ్రెస్, బీజేపీ నెక్ టు నెక్… మేయర్ పీఠంపై ఉత్కంఠ
అన్ని సర్వేలు, పార్టీల అంచనాలు హంగ్ వైపే సూచన
రెబల్ అభ్యర్థులే కింగ్‌మేకర్లా..? సమీకరణాలపై పార్టీల‌ ఫోకస్
ఫలితాలకు ముందే గెలిచే అవ‌కాశ‌మున్న స్వ‌తంత్ర అభ్య‌ర్థుల‌తో మంత‌నాలు
గెలిస్తే మ‌ద్ద‌తివ్వాల‌ని కీల‌క ప‌ద‌వులు సైతం ఆఫ‌ర్‌..!

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఈసారి స్పష్టమైన మెజారిటీ లేకుండా హంగ్ పరిస్థితికి దారితీయనున్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. మొత్తం 66 డివిజన్లున్న కార్పొరేషన్‌లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 34 నుంచి 36 మధ్యలో ఉండగా, ఏ ఒక్క పార్టీ కూడా ఈ సంఖ్యను ఒంటరిగా చేరే పరిస్థితి లేదన్న అంచనాలు వ్యక్త మవుతున్నాయి. దీంతో మేయర్ ఎంపిక ఫలితాల అనంతరం జరిగే రాజకీయ సమీకరణాలపైనే ఆధారపడే పరిస్థితి నెలకొంది. ఒకటి లేదా రెండు స్థానాల తేడాతో.. మొత్తం అధికార సమీకరణాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉంద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది.

కాంగ్రెస్ – బీజేపీ మధ్యే నెక్ టు నెక్ పోటీ

ఈసారి కార్పొరేషన్‌లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే కేంద్రీకృతమైందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అనేక డివిజన్లలో ఈ రెండు పార్టీల మధ్య స్వల్ప ఓట్ల తేడాతోనే గెలుపోట‌ముల ఫ‌లితాలు ఉంటాయ‌నే రాజ‌కీయ చ‌ర్చ జ‌రుగుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అదే ఆధిక్యాన్ని కార్పోరేష‌న్‌లోనూ కొనసాగించాలన్న లక్ష్యంతో ముందుకు సాగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కరీంనగర్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గట్టి పోటీ ఇచ్చింది. అన్ని సర్వేలు, పార్టీల అంతర్గత అంచనాలు కూడా ఈసారి హంగ్ పరిస్థితి తప్పదన్న సంకేతాలిస్తుండ‌టం గ‌మ‌నార్హం.
గతంలో కార్పొరేషన్‌పై ఆధిపత్యం చెలాయించిన బీఆర్ఎస్ ఈసారి ప్రధాన పోటీలో వెనుకబడే పరిస్థితి కనిపిస్తున్నట్లు అంచనాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోవడం, మారిన రాజకీయ సమీకరణాలు, స్థానిక స్థాయిలో పెరిగిన పోటీ బీఆర్ఎస్ ప్రభావాన్ని తగ్గించినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రెబల్ అభ్యర్థులపై ప్రధాన పార్టీల దృష్టి

ఈ ఎన్నికల్లో కొన్ని కీలక డివిజన్లలో రెబల్ అభ్యర్థులు బలంగా నిలిచారు. ప్రధాన పార్టీల నుంచి టికెట్ దక్కని నాయకులు స్వతంత్రులుగా బరిలోకి దిగడంతో కొన్ని డివిజన్లలో పోటీ త్రికోణంగా మారింది. ఈ రెబల్ అభ్యర్థులే ఫలితాల తర్వాత అధికార సమీకరణంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్వల్ప మెజారిటీ తేడాలు ఉన్న చోట రెబల్స్ విజయం సాధిస్తే.. వారే కింగ్ మేక‌ర్లుగా అవ‌త‌రించే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఫలితాలు వెలువడకముందే ప్రధాన పార్టీలు రెబ‌ల్ అభ్య‌ర్థుల‌తో ముందస్తు మంతనాలు ప్రారంభించినట్లు సమాచారం. గురువారం ఉదయం నుంచే స్వతంత్ర అభ్యర్థులతో సంప్రదింపులు కొనసాగుతున్నట్లు విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది. మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు అవసరమైన సంఖ్యను సాధించడంపై కాంగ్రెస్, బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇండిపెండెంట్లు, రెబల్ అభ్యర్థులే ఇప్పుడు కరీంనగర్ కార్పొరేషన్‌లో తుది నిర్ణయాత్మక శక్తిగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫలితాల తర్వాత జరిగే చర్చలు, ఒప్పందాలు, రాజకీయ సమీకరణాలే మేయర్ పీఠాన్ని నిర్ణయించే కీలక అంశాలుగా మారనున్నాయి. మొత్తంగా ఈసారి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు స్పష్టమైన మెజారిటీ లేకుండా హంగ్ పరిస్థితికి దారితీయనున్నాయ‌న్న అంచ‌నాలు వ్య‌క్తమ‌వుతున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.