epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

హైరైజ్ బిల్డింగ్‌ల‌కు ఓకే

హైరైజ్ బిల్డింగ్‌ల‌కు ఓకే
హైద‌రాబాద్ నిర్మాణ రంగంలో ఇక విప్ల‌వ‌మే..!
చిన్న స్థ‌ల‌మున్నా ఇక‌పై అనుమ‌తులు
బిల్డింగ్ రూల్స్‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం కీలక మార్పులు
సెట్‌బ్యాక్, డెన్సిటీలో భారీ సడలింపులు
నేటి నుంచి కొత్త నిర్మాణ నిబంధనలు అమ‌ల్లోకి
డెవలపర్లకు వెసులుబాటు.. రియ‌ల్ ఎస్టేట్ రంగానికి ఊతం

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : పట్టణ అభివృద్ధికి ఊతమిస్తూ తెలంగాణ ప్రభుత్వం బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు చేసింది. 2012 నాటి తెలంగాణ బిల్డింగ్ నిబంధనల్లో సవరణలు చేస్తూ టీడీఆర్ వినియోగాన్ని విస్తరించింది. ఎత్తైన భవనాల నిర్మాణానికి ఉన్న పరిమితులను సడలిస్తూ డెవలపర్లకు మరింత స్వేచ్ఛ కల్పించింది. ఈ మార్పులు మార్చి 22, 2026న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం ద్వారా అమల్లోకి వచ్చాయి. పట్టణాల్లో స్థలాభావం పెరుగుతున్న నేపథ్యంలో నిలువు విస్తరణకు ప్రోత్సాహం ఇవ్వడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. టీడీఆర్ విధానాన్ని మరింత విస్తరించడం ద్వారా నగరాల్లో అభివృద్ధి వేగవంతం అవుతుందని అంచనా వేస్తున్నారు.

హై రైజ్‌కు కొత్త నిర్వ‌చ‌నం..

కొత్త నిబంధనల ప్రకారం హై రైజ్ భవనాల నిర్వచనంలో మార్పులు చేశారు. ఇంతకు ముందు ఉన్న పరిమితులను సవరించి ఇప్పుడు 21 మీటర్లకు పైగా ఉన్న భవనాలను హై రైజ్‌గా పరిగణిస్తున్నారు. అయితే 18 నుంచి 21 మీటర్ల మధ్య ఉన్న భవనాలకు కూడా టీడీఆర్ వినియోగంతో అనుమతులు ఇవ్వనున్నారు. చిన్న స్థలాలపై కూడా ఎత్తైన భవనాల నిర్మాణానికి వీలు కల్పించడం ద్వారా నగరాల్లో స్థల వినియోగం మెరుగుపడే అవకాశం ఉంది. కొన్ని కేటగిరీల భవనాలకు టీడీఆర్ వినియోగాన్ని తప్పనిసరి చేశారు. 11 నుంచి 20 అంతస్తుల భవనాల్లో 10వ అంతస్తు పైభాగానికి 3 శాతం టీడీఆర్ అవసరం ఉంటుంది. 20 అంతస్తులకు పైగా ఉన్న భవనాలకు 20వ అంతస్తు పైభాగానికి 5 శాతం టీడీఆర్ వర్తిస్తుంది. ముందుగా ప్రతిపాదించిన అధిక శాతంతో పోలిస్తే ఈ నిబంధన కొంత సడలింపుగా భావిస్తున్నారు. అయితే డెవలపర్లపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశముంది.

సెట్‌బ్యాక్, డెన్సిటీలో సడలింపులు

హై రైజ్ భవనాలకు సెట్‌బ్యాక్‌లలో 10 శాతం వరకు సడలింపు ఇవ్వనున్నారు. అయితే కనీసంగా 7 మీటర్ల భద్రతా దూరం తప్పనిసరిగా ఉండాలి. పెద్ద స్థలాలపై అదనంగా 3 నుంచి 5 అంతస్తులు నిర్మించుకునే అవకాశం కూడా కల్పించారు. రోడ్డు వెడల్పును బట్టి ఈ అదనపు అంతస్తుల అనుమతులు ఇవ్వడం ద్వారా నగర ప్రణాళికలో సమతుల్యత సాధించాలనే ఉద్దేశ్యం కనిపిస్తోంది. ఈ సవరణలు రియల్ ఎస్టేట్ రంగంపై మిశ్రమ ప్రభావం చూపనున్నాయి. ఒకవైపు డెవలపర్లకు మరింత డిజైన్ స్వేచ్ఛ లభించనుంది. మరోవైపు టిడిఆర్ తప్పనిసరి నిబంధనల కారణంగా నిర్మాణ వ్యయాలు పెరిగే అవకాశం ఉంది. ప్రత్యేకంగా హై రైజ్ ప్రాజెక్టుల్లో చదరపు అడుగుకు రూ.300 నుంచి రూ.400 వరకు అదనపు ఖర్చు వచ్చే అవకాశముందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం మీద పట్టణాభివృద్ధికి దోహదపడే ఈ మార్పులు, రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త దిశను సూచిస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా...

ఇనుగాల‌కు అవ‌మానం

ఇనుగాల‌కు అవ‌మానం కుడా మాజీ చైర్మ‌న్‌కు నో ఫేర్‌వెల్ ఆఘ మేఘాల మీద నూత‌న...

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..?

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..? బీఆర్ఎస్‌తో దంప‌తుల‌ మంతనాలు! కేటీఆర్‌ నేరుగా కొండా సురేఖకు ఫోన్‌ గత...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.