epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సీడ్ కంపెనీ మోసం

సీడ్ కంపెనీ మోసం
ఆశ చూపించి విత్తనాలు విక్ర‌యం
కొనుగోలు స‌మ‌యంలో చేతులెత్తేసిన ఆర్గ‌నైజ‌ర్లు
క్వింటాకు అధిక ధ‌ర చెల్లిస్తామ‌ని సాగుకు హామీ
ఇప్పుడు పంట‌ను తీసుకెళ్ల‌డానికి ముందుకు రాని వైనం
ప్రజావాణిలో గోడు వెల్ల‌గ‌క్కుకున్న గిరిజ‌న రైతులు
ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేత
న్యాయం చేయాలని గిరిజన రైతుల వేడుకోలు

కాకతీయ, కారేపల్లి : అమాయక గిరిజన రైతులను నమ్మించి విత్తనాలు వేయించి, పంట చేతికొచ్చే సమయానికి ఆర్గనైజర్లు ముఖం చాటేయడంతో తవసిబోడు గ్రామానికి చెందిన రైతులు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు. సింగరేణి మండలంలోని రేలకాయలపల్లి గ్రామపంచాయతీ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బాధిత రైతులు తమ గోడును వెల్లగక్కారు. తమకు జరిగిన అన్యాయంపై తహసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. పంటపై పెట్టిన పెట్టుబడి మొత్తం వృథా అయిందని, ఇప్పుడు తమ పరిస్థితి దయనీయంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వైరా ప్రాంతానికి చెందిన తీగల బంజారి నివాసి ఎస్.కె సైదా అనే వ్యక్తి, తవసిబోడుకు చెందిన భూక్యా చందర్ అనే ఏజెంట్ ద్వారా గ్రామంలోని రైతులను సంప్రదించినట్లు తెలుస్తోంది. క్రిస్టల్ కంపెనీకి చెందిన ఒక ప్రత్యేక మొక్కజొన్న విత్తనాన్ని సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుందని, క్వింటాకు 3200 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ మాటలు నమ్మిన రైతులు సుమారు 45 ఎకరాల్లో పంట సాగు చేశారు. విత్తనాలు, ఎరువులు, కూలీల కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. మంచి దిగుబడి వస్తుందనే ఆశతో పంటను జాగ్రత్తగా పెంచారు. పంట కోతకు వచ్చిన తర్వాత ఆర్గనైజర్లను సంప్రదించగా వారు ఫోన్ ఎత్తడం మానేశారని రైతులు చెబుతున్నారు. కంపెనీని సంప్రదిస్తే అలాంటి విత్తనాలు తమ దగ్గర లేవని చెప్పడంతో రైతులు షాక్‌కు గురయ్యారు. తాము పూర్తిగా మోసపోయామని, ఇప్పుడు పండించిన పంటను ఎవరికి అమ్మాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు. పెట్టుబడులు తిరిగి రాకపోవడంతో అప్పుల్లో కూరుకుపోయామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. బాధిత రైతులు నరేందర్, రమేష్, వీరబాబు, నాగేశ్వరరావు, రాంబాబు, సీతారాం, దీప్లా, రాంచంద్, బాల తదితరులు కలిసి అధికారులను ఆశ్రయించారు. ఈ ఘటన గిరిజన రైతులపై జరుగుతున్న మోసాలను మరోసారి బహిర్గతం చేసింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆర్గనైజర్లను పిలిపించి పంట కొనుగోలు చేయించేలా చర్యలు తీసుకోవాలని, తమకు జరిగిన నష్టానికి న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.