epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్ర‌మాదం కాదు.. హ‌త్య‌..!

ప్ర‌మాదం కాదు.. హ‌త్య‌..!
లాభాల కోసం ప్రాణాల పణంగా పెడుతున్నారంటూ విమ‌ర్శ‌
దుర్గా యాజమాన్యం నిర్లక్ష్యంతో కార్మికుడి మృతి చెందాడు
మ‌ణుగూరు ఓసీ-2లో ఘ‌ట‌న‌పై సీఐటీయూ ఘాటు స్పంద‌న‌
యాజ‌మాన్యం నిర్ల‌క్ష్యంతోనే కార్మికుడు చ‌నిపోయాడంటూ విమ‌ర్శ‌లు
హత్యగా కేసు నమోదు చేయాలంటూ డిమాండ్‌
మైన్స్ ఏరియాలో కార్మిక చ‌ట్టాలు అమ‌లు చేయ‌డం లేద‌ని మండిపాటు

కాకతీయ, మణుగూరు : మ‌ణుగూరు సింగరేణి ఓసి-2లో జ‌రిగిన ఘటనలో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఇది ప్రమాదం కాదని, దుర్గా కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంతో జరిగిన హత్యేనని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు ఆరోపించారు. బాధ్యులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.గాయపడిన కార్మికులను సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు కే బ్రహ్మచారి, కోశాధికారి పద్మ, సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం కొత్తగూడెం బ్రాంచ్ కార్యదర్శి భూక్యా రమేష్, మణుగూరు బ్రాంచ్ కార్యదర్శి గద్దల శ్రీనివాసరావులతో కలిసి బి మధు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు యాజమాన్యం నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనలో మరో ముగ్గురు కార్మికులు గాయపడి చికిత్స పొందుతున్నారు. సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని సంఘాల నాయకులు పరామర్శించి పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యాజమాన్యం వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల సమయంలో పాటించాల్సిన కనీస రక్షణ సూత్రాలు కూడా అమలు కాలేదని బి మధు పేర్కొన్నారు. ఫిట్నెస్ లేని వాహనాలు వినియోగించడం, విధి ప్రకారం పాటించాల్సిన నిబంధనలను విస్మరించడం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు. టైర్ పనుల్లో మిషన్ వినియోగించాల్సిన చోట చేతిపనితో నిర్వహించడం, చైన్ బిగించకుండా పని చేయించడం వంటి నిర్లక్ష్యాలు ప్రాణ నష్టానికి దారితీశాయని అన్నారు. మైన్స్ చట్టం ప్రకారం ఏర్పాటు చేయాల్సిన రక్షణ కమిటీలు కూడా నామమాత్రంగా ఉన్నాయని విమర్శించారు. రక్షణపై శ్రద్ధ లేకపోవడం వల్లే కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు.

చట్టాలు అమలు లేకపోవడంపై విమర్శలు

అంతర్రాష్ట్ర వలస కార్మిక చట్టాన్ని కూడా యాజమాన్యం ఉల్లంఘిస్తున్నదని మ‌ధు ఆరోపించారు. కార్మికుల వివరాలు నమోదు చేయకపోవడం, అవసరమైన అనుమతులు తీసుకోకపోవడం జరుగుతోందన్నారు. వేతనాలను బ్యాంక్ ద్వారా చెల్లించకపోవడం వల్ల కార్మికులకు రావాల్సిన నష్టపరిహారం కూడా దక్కడం లేదని చెప్పారు. చట్ట ప్రకారం రికార్డులు నిర్వహించకపోవడం, రక్షణ సూత్రాలన్నింటినీ విస్మరించడం వల్ల కాంట్రాక్ట్ కార్మికుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు కూడా తమ బాధ్యతలు నిర్వర్తించకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. ఇకనుంచి రక్షణ సూత్రాలను కఠినంగా అమలు చేయాలని, కార్మికుల ప్రాణాలకు భద్రత కల్పించాలని, సింగరేణి యాజమాన్యం పర్యవేక్షణ పెంచాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.