epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గ్రామసభలతో ప్రజాపాలన బలోపేతం

గ్రామసభలతో ప్రజాపాలన బలోపేతం
ఏప్రిల్ 2న గ్రామ, వార్డు సభలు నిర్వహించాలి
పథకాల వివరాలు ప్రజలకు చేరవేయాలి
లబ్ధిదారులతో నేరుగా మాట్లాడాలి
ప్రజా ప్రతినిధుల హాజరు తప్పనిసరి
సభల ద్వారా అవగాహన పెంచాలి
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

కాకతీయ, వరంగల్ బ్యూరో : ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక అమలుకు గ్రామ సభలే వేదిక అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వ పథకాల వివరాలు ప్రజలకు చేరేలా గ్రామ, వార్డు సభలను సమగ్రంగా నిర్వహించాలని సూచించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2న సభలను విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ గ్రామ సభల ద్వారా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను స్పష్టంగా ప్రజలకు వివరించాలని అన్నారు. గ్రామపంచాయతీలకు వచ్చిన నిధులు, వాటి వినియోగంపై వివరాలు తెలియజేయాలని సూచించారు. జీవన బీమా పథకం, పాఠశాల విద్యార్థులకు అల్పాహారం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వంటి పథకాల వివరాలను ప్రజలకు చెప్పాలని అన్నారు.

లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడాలి

రైతు భరోసా, ఉచిత విద్యుత్, వ్యవసాయ బోర్లు, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం వంటి పథకాల లబ్ధిదారులతో నేరుగా మాట్లాడాలని సూచించారు. ప్రజల అభిప్రాయాలను సేకరించి వాటిని పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. గ్రామ సభ ప్రారంభానికి ముందు రాష్ట్ర గీతం ఆలపించి, ముఖ్యమంత్రి సందేశాన్ని చదవాలని తెలిపారు. అనంతరం పథకాల వివరాలను వినిపించాలని సూచించారు. ప్రజా ప్రతినిధులను తప్పనిసరిగా ఆహ్వానించాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు మాట్లాడుతూ గ్రామ, వార్డు సభల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. సభలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అధికారులతో సమావేశమై గ్రామ, వార్డు సభల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి సభలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్ రవి, డీఆర్డీవో మేన శ్రీను, జడ్పీ సీఈఓ శేషాద్రి, డీపీవో లక్ష్మీ రమాకాంత్, డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.