epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

టెక్స్టైల్ పార్క్ భూనిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

టెక్స్టైల్ పార్క్ భూనిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది..

*863 మంది భూనిర్వాసితులకు ఇంటి రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వబోతున్నాం..

*భూ నిర్వాసితులకు 43.15 కోట్లతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం

*రూ. 43.33కోట్లతో రాజీవ్ గాంధీ టౌన్షిప్ నిర్మాణం..

*టెక్స్టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి తో కలిసి పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి..

కాకతీయ,గీసుగొండ: టెక్స్టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి తెలిపారు. మండలంలోని కొనాయిమాకుల పీఎస్ఆర్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ భూనిర్వాసితులకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, జిల్లా కలెక్టర్ సత్య శారద కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ నిర్వాసితుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 863 మంది లబ్ధిదారులకు ఇంటి రిజిస్ట్రేషన్ పట్టాలు అందజేయ నున్నట్లు తెలిపారు.భూ నిర్వాసితులకు గృహ వసతి కల్పించేందుకు రూ.43.15 కోట్ల వ్యయంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు. అదనంగా సకల సౌకర్యాలతో రాజీవ్ గాంధీ టౌన్షిప్ నిర్మాణ పనులు కొనసాగుతు న్నాయని తెలిపారు.భూ నిర్వాసితుల అంగీకారం మేరకు ఒక్కో ఇంటిని రూ.5 లక్షల వ్యయంతో నిర్మించి పూర్తి చేసి అందజేయడం జరుగుతుందని వెల్లడించారు.

*రూ.43.33 కోట్లతో రాజీవ్ గాంధీ టౌన్షిప్ అభివృద్ధి..

రాజీవ్ గాంధీ టౌన్షిప్ అభివృద్ధి కోసం మొత్తం రూ.43.33 కోట్లతో మౌలిక సదుపాయాల పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో భాగంగా హౌసింగ్ లేఅవుట్‌లో వర్షపు నీటి కాల్వల నిర్మాణానికి రూ.910 లక్షలు, నీటి సరఫరా వ్యవస్థ, కాలువల నెట్వర్క్, అండర్‌గ్రౌండ్ సంప్, మురుగు నీటి శుద్ధి ప్లాంట్లకు రూ.920 లక్షలు కేటాయించారు. ప్రాథమిక పాఠశాల భవనానికి రూ.277 లక్షలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రూ.160 లక్షలు, గ్రామపంచాయతీ కార్యాలయానికి రూ.63 లక్షలు, వెటర్నరీ ఆసుపత్రికి రూ.50 లక్షలు మంజూరు చేశారు. రోడ్లు,వర్షపు నీటి కాల్వలు, పైప్ కల్వర్ట్ నిర్మాణానికి రూ.760 లక్షలు,విద్యుత్ సదుపాయాల కోసం రూ.182.93 లక్షలు, కొత్త ఎంఎస్ఎంఈ క్లస్టర్ ఏర్పాటుకు రూ.1010.40 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు.టెక్స్టైల్ పార్క్ అభివృద్ధిపై ఇటీవల జరిగిన వ్యాఖ్యలకు స్పందిస్తూ, తమ హయాంలో చేపడుతున్న పనులను ఇతరులు తమ ఖాతాలో వేసుకోవడం సరికాదన్నారు. గత ప్రభుత్వ కాలంలో కేవలం శంకుస్థాపన మాత్రమే జరిగిందని, అనంతరం టెక్స్టైల్ పార్క్ అభివృద్ధిపై సరైన దృష్టి సారించలేదని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పలుమార్లు టెక్స్టైల్ పార్క్‌ను సందర్శించి భూ నిర్వాసితుల సమస్యలను తెలుసుకుని,కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపి అవసరమైన వసతుల కల్పనకు కృషి చేసినట్లు తెలిపారు.భూ నిర్వాసితుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. భూ నిర్వాసితులకు గృహ నిర్మాణాలతో పాటు అన్ని మౌలిక సదుపాయా లతో రాజీవ్ గాంధీ టౌన్షిప్‌ను ఏర్పాటు చేసి, దానిని గ్రామ పంచాయతీగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. అనంతరం 115 మంది భూనిర్వాసితులకు ఇంటి రిజిస్ట్రేషన్ పట్టాలను పంపిణీ చేశారు.

*కూడా సంస్థ ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తాం…
కూడా చైర్మన్ ఇనుగాల..
టెక్స్టైల్ పార్క్ భూనిర్వాసితులకు కూడా సంస్థ ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో టెక్స్టైల్ పార్క్ భూనిర్వాసితుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిందని తెలిపారు. భూ నిర్వాసితులకు ఎకరానికి 100 గజాల చొప్పున ఇంటి స్థలం ఇవ్వాలని అప్పట్లో చేసిన ఆందోళనల ఫలితంగానే నేడు ఆ హామీ అమలు అవుతోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పాటు రాజీవ్ గాంధీ టౌన్షిప్‌లో అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

*అనధికార లేఔట్లపై ఉక్కు పాదం మోపుతాం

కొంతమంది స్థిరాస్తి వ్యాపారులు అనధికారికంగా లేఅవుట్లు చేసి క్రయవిక్రయాలు నిర్వహిస్తున్నారని, వీటిపై కఠిన చర్యలు తీసుకుంటామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి,కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు.నాన్ లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశముందని, అలాంటి లావాదేవీలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే అనధికార లేఅవుట్లలో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లయితే వాటిని కూల్చివేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ నాన్ లేఅవుట్లపై ప్రత్యేక అధికార బృందాలను ఏర్పాటు చేసి అక్రమాలపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి,వరంగల్ ఆర్డీఓ సుమ,జెడ్పీ సీఈఓ రామ్ రెడ్డి, పరిశ్రమల శాఖ జెడ్‌ఎం స్వామి, గీసుకొండ తహసిల్దార్, సంగెం తహసిల్దార్ రాజకుమార్, స్థానిక సర్పంచులు వజ్ర రాజు, కక్కేర్ల సుభాష్,గాలి యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.