epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రైతులపై నిర్లక్ష్యం తగదు

రైతులపై నిర్లక్ష్యం తగదు
పంట నష్టంపై ప్రభుత్వం మౌనం
బీమా పథకాల అమలులో లోపాలు
మొక్కజొన్నకు మద్దతు ధర అమలు కావడం లేదు
కొనుగోలు కేంద్రాల లేమితో రైతుల ఇబ్బందులు
మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి

కాకతీయ, జగిత్యాల్/రాయికల్ : ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నేలపాలైన రైతులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. రాయికల్ మండల కేంద్రంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కోత దశలో ఉన్న మొక్కజొన్న, మామిడి పంటలు నష్టపోయినా ఇప్పటివరకు ప్రభుత్వం పరిహారం ప్రకటించకపోవడం దురదృష్టకరమన్నారు. గత సంవత్సరం కూడా ఇదే పరిస్థితి నెలకొన్నదని గుర్తుచేశారు. పంటల బీమా పథకం సక్రమంగా అమలైతే రైతులకు కొంత ఉపశమనం లభించేదని, కానీ అమలులో స్పష్టత లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారని విమర్శించారు. బీమా కంపెనీల ద్వారా కూడా పరిహారం అందకపోవడం బాధాకరమన్నారు.

మద్దతు ధర కేవలం మాటలేనంటూ విమర్శ

మొక్కజొన్నకు నిర్ణయించిన కనీస మద్దతు ధర రూపాయలు 2400గా ఉన్నప్పటికీ, మార్కెట్‌లో రైతులకు రూపాయలు 1800 మాత్రమే లభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయికల్ మార్కెట్‌లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడం, ప్రారంభమైన చోట్ల కూడా తూకం ప్రక్రియ ఆలస్యమవడం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూపాయలు 20000 చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా కింద ఎకరానికి రూపాయలు 6000 మాత్రమే ఇవ్వడం సరిపోదని పేర్కొన్నారు. కమతం పరిమితులు లేకుండా అన్ని ఎకరాలకు సాయం అందించాలని సూచించారు. రైతు బీమా పథకాన్ని కొనసాగించాలని, కొత్తగా ప్రవేశపెడుతున్న కుటుంబ బీమా పథకం రైతులకు పూర్తిస్థాయిలో ఉపయోగపడదని అభిప్రాయపడ్డారు. పంటలు పూర్తి దిగుబడి ఇవ్వాలంటే ఏప్రిల్ 15 వరకు ఎస్సారెస్పీ ద్వారా సాగునీరు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉందని జీవన్ రెడ్డి హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.