రాజ్యసభ సభ్యుడిగా వేం ప్రమాణ స్వీకారం
హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, వరంగల్ నేతలు
నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు
కాకతీయ, వరంగల్ బ్యూరో : రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, ఎంపీ కడియం కావ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కే.ఆర్. నాగరాజు, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించడం తెలంగాణకు గర్వకారణమన్నారు. ఆయన తన అనుభవంతో పార్లమెంట్‌లో ప్రజా సమస్యలను సమర్థవంతంగా ప్రస్తావించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా ఆయన విశేష సేవలందించాలని ఆకాంక్షించారు.

