epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మొక్కజొన్న కొనుగోళ్లలో షరతులు విధించొద్దు

మొక్కజొన్న కొనుగోళ్లలో షరతులు విధించొద్దు
ఫంగస్, సన్నాల పేరుతో రైతులను వేధించడం దారుణం
సాగర్ జలాలు విడుదల చేసి ఎండిపోతున్న వరిని ఆదుకోవాలి
బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు

కాకతీయ, ఖమ్మం టౌన్: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు మార్కెట్లలో పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అత్యంత దుర్మార్గమని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ధ్వజమెత్తారు. మొక్కజొన్న కొనుగోళ్లలో అధికారులు పెడుతున్న నిబంధనలను తక్షణమే తొలగించాలని, ఎండిపోతున్న వరి పొలాలను కాపాడేందుకు నాగార్జున సాగర్ జలాలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం రైతాంగ సమస్యలపై ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పెట్టుబడులు పెరిగి ఇబ్బందుల్లో ఉన్న రైతులకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని కోటేశ్వరరావు ఆరోపించారు. బహిరంగ మార్కెట్‌లో క్వింటాల్ మొక్కజొన్నకు కేవలం రూ. 1700 నుండి రూ. 1800 మాత్రమే పలుకుతోందని, ఇది పెట్టుబడికి కూడా సరిపోదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మార్క్‌ఫెడ్ అధికారులు ఫంగస్, సన్నాల పేరుతో కొర్రీలు పెడుతూ రైతులను వేధిస్తున్నారని మండిపడ్డారు. నాణ్యత పరీక్షల పేరుతో కాలయాపన చేయడం వల్ల రైతులు గత్యంతరం లేక తక్కువ ధరకే దళారులకు అమ్ముకుంటున్నారని, మార్కెట్ చైర్మన్ వెంటనే స్పందించి కొనుగోళ్లు సజావుగా సాగేలా చూడాలని డిమాండ్ చేశారు.

నిలువునా ఎండిపోతున్న వరి పొలాలు

సాగర్ జలాలను ఆకస్మికంగా నిలిపివేయడంతో ఆయకట్టు చివరి ప్రాంతాల్లో వరి పంట చేతికొచ్చే దశలో ఎండిపోతోందని కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల రైతులు కన్నీరుమున్నీరవుతున్నారని, తక్షణమే సాగర్ నీటిని విడుదల చేసి పంటను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మార్క్‌ఫెడ్ అధికారులపై జిల్లా కలెక్టర్ కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ధాన్యం రవాణాకు లారీల కొరత లేకుండా చూడాలని, అన్నదాతలను ఆదుకోవడంలో ప్రభుత్వం ఇంకా ఆలస్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. బీజేపీ ఎల్లప్పుడూ రైతు పక్షాన నిలబడి పోరాడుతుందని స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.