పోలీస్ కమిషనరేట్‌లో ఎస్‌ఐల బదిలీలు
పరిపాలనా కారణాలతో సీపీ తక్షణ చర్యలు
స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా పలువురి నియామకం
కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సబ్ ఇన్‌స్పెక్టర్ల బదిలీలు మరియు నియామకాలకు సంబంధించి పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. పరిపాలనా కారణాల దృష్ట్యా ఈ మార్పులు చేపట్టినట్లు అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ బదిలీలు తక్షణ ప్రభావంతో అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు. కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న ఎస్‌ఐలను బదిలీ చేస్తూనే, మరికొందరిని స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా నియమించారు.
శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో క్షేత్రస్థాయిలో పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఈ బదిలీలు దోహదపడతాయని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా స్టేషన్ల వారీగా బాధ్యతలు చేపట్టిన కొత్త అధికారులు తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడకుండా పనిచేయాలని పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సూచించారు. నిరంతరం నిఘా ఉంచుతూ నేరాల నియంత్రణకు కృషి చేయాలని బదిలీ అయిన అధికారులకు దిశానిర్దేశం చేశారు.
బదిలీలు మరియు నియామకాల వివరాలు ఇలా ఉన్నాయి:
సాయి ప్రసన్న కుమార్: సీసీఎస్ వరంగల్ నుంచి నల్లబెల్లి ఎస్ హెచ్ ఓ గా నియామకం.
వి. గోవర్ధన్: నల్లబెల్లి ఎస్ హెచ్ ఓ నుంచి వరంగల్ వీఆర్ కు బదిలీ.
జి. రామ్ మోహన్: మడికొండ పీఎస్ నుంచి ఖానాపూర్ ఎస్ హెచ్ ఓ గా నియామకం.
చి. రఘుపతి: ఖానాపూర్ ఎస్ హెచ్ ఓ నుంచి వరంగల్ వీఆర్ కు బదిలీ.
ఈ. నర్సింహరావు: ధర్మసాగర్ పీఎస్ నుంచి ఎల్కతుర్తి ఎస్ హెచ్ ఓ గా నియామకం.
ఎ. ప్రవీణ్ కుమార్: ఎల్కతుర్తి ఎస్ హెచ్ ఓ నుంచి వరంగల్ వీఆర్ కు బదిలీ.
ఏ. శ్రీకాంత్: వరంగల్ వీఆర్ నుంచి బాచన్నపేట ఎస్ హెచ్ ఓ గా నియామకం.
ఎస్.కే. హమీద్: బాచన్నపేట నుంచి వరంగల్ వీఆర్ కు బదిలీ.
బి. మంగా: వరంగల్ వీఆర్ నుంచి కాజీపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు నియామకం.

