శంకర్ గౌడ్ అన్న …
నీ ప్రాణత్యాగం వృధా కానివ్వం
ఇక ఉపేక్షించేది లేదు.
కదం తొక్కిన ఆర్టీసీ జేఏసీ
కొత్తగూడెం బస్టాండ్ ముట్టడి
కాకతీయ ,కొత్తగూడెం: గత మూడు రోజుల జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా శుక్రవారం ఆర్టీసీ జేఏసీ నాయకులు ధ్వజమెత్తారు. ఆర్టీసీ పరిరక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన శంకర్ గౌడ్ ప్రాణత్యాగాని వృధా కానివ్వమంటూ టిఆర్ఎస్ సిపిఐ సిపిఎం బిజెపి తదితర పార్టీల నాయకులు ఆర్టీసీ సమ్మెకు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు

ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూఆర్టీసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి. 2021 వేతన సవరణ 30% ఫిట్మెంట్ తో అమలు చేయాలి. 2025 వేతన సవరణ అమలు చేయాలన్నారు.మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ప్రతినెల 400 కోట్లు ఆర్టీసికి ఇవ్వాలని. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి / బెడ్ విన్నర్ పోస్టులను పర్మినెంట్ ఉద్యోగాల కింద భర్తీ చేయాలనీ డిమాండ్ చేశారు.ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలనీ.ఆర్టీసి ఉద్యోగులపై పనిభారాలు తగ్గించాలి కండక్టర్ డ్రైవర్లలపై కే యం పి యల్ ఈ పీకే వేధింపులు మానుకోవాలని ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వమే కొని ఆర్టీసికి ఇవ్వాలని ఆర్టీసి స్థలాలను ఈవీ బస్సులకు ఇవ్వరాదన్నారు. అద్దె బస్సులను, అద్దె బస్సుల డ్రైవర్లలను ఆర్టీసిలో విలీనం చేసుకోవాలనీ గతంలో మాదిరిగా జాతీయం చేసుకోవాలనీ గ్రేటర్ హైదరాబాద్ జోన్లో లో పనిచేస్తున్న సిబ్బందిని కరీంనగర్ జోన్, హైదరాబాద్ జోన్లకు బలవంతగా బదిలి చేసే ఉత్తర్వులను రద్దు చేయాలన్నారు.2019సమ్మే కాలంలో నమోదైన పోలీస్ కేసులను ఎత్తివేయాలనీ మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి. రద్దీ కనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి. అన్ని కేటగిరీలలోని ఖాళీలను భర్తీ చేయాలి. రిటైరైన ఉద్యోగుల బకాయిలను అన్నిటినీ చెల్లించాలన్నారు .చెల్లించటంతో పాటు దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను పరిష్కరించాలనీ డిమాండ్ చేశారు. జేఏసీ నాయకులు చేస్తున్న సమ్మెలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పాల్గొన్నారు.


