epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రైతులు, మిల్లర్లు సమన్వయంతో ముందుకు సాగాలి

రైతులు, మిల్లర్లు సమన్వయంతో ముందుకు సాగాలి
మిల్లర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
ములుగులో రైస్‌మిల్‌ అసోసియేషన్ భవనం ప్రారంభం

కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లాలో వరి సాగు విస్తారంగా ఉన్న నేపథ్యంలో రైతులు, రైస్ మిల్ యజమానులు పరస్పర ఐక్యతతో ముందుకు సాగాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన రైస్ మిల్ అసోసియేషన్ భవనాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. జిల్లాలోని సాగునీటి వనరులు రైతులకు ఎంతో అనుకూలంగా ఉన్నాయని, వరి ఉత్పత్తిలో ములుగు అగ్రస్థానంలో నిలవడం గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. “మిల్లర్లు కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారే. వ్యాపారంలో రాణిస్తూనే, రైతుల సమస్యలను అర్థం చేసుకుని వారికి అండగా నిలవాలి” అని సూచించారు. కొత్త భవనం మిల్లర్లందరికీ ఒక ఉమ్మడి వేదికగా నిలవాలని ఆకాంక్షించారు.

బియ్యం సేకరణలో కేంద్రం సహకరించాలి..
జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం మిల్లింగ్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తున్నా, కేంద్రం నుంచి బియ్యం లిఫ్టింగ్‌లో (సేకరణలో) జాప్యం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల మిల్లర్లు సొంతంగా నిల్వ చేయాల్సి వస్తోందని, అధిక ఉష్ణోగ్రతల వల్ల ధాన్యం బరువు తగ్గి ఆర్థికంగా నష్టపోతున్నామని వివరించారు. బాయిల్డ్ రైస్ టార్గెట్ పెంచాలని, మిల్లర్లకు స్పష్టమైన కోటాను కేటాయించి మిగిలిన ధాన్యాన్ని ప్రభుత్వ గోదాముల్లో నిల్వ చేయాలని ప్రవీణ్ కోరారు. గత బకాయిల చెల్లింపులో అధికారుల చొరవను అభినందిస్తూనే, భవిష్యత్తులో డిఫాల్ట్ కాకుండా ప్రభుత్వం ఆదుకోవాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రవిచందర్ మరియు అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.