మాజీ మంత్రి పువ్వాడ అజయ్ పరామర్శ
కాకతీయ, ఖమ్మం: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శనివారం ఖమ్మం నగరంలోని పలు సామాజిక, ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడంతో పాటు, పలువురు ప్రముఖుల గృహప్రవేశాలకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఇటీవల మరణించిన పలువురు పార్టీ కార్యకర్తలు, ప్రముఖుల నివాసాలకు వెళ్లి వారి చిత్రపటాలకు నివాళులర్పించారు. నగరంలోని 15వ డివిజన్ పుట్టకోటలో వందిళ్ల రాంబాబు కుమారుడు మహేష్ – జాన్సీల వివాహానికి, గట్టయ్య సెంటర్ వద్ద జర్నలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి కుమార్తె కీర్తన రెడ్డి – అజయ్ వర్ధన్ రెడ్డిల వివాహ వేడుకకు అజయ్ కుమార్ హాజరై వధూవరులను దీవించారు. అనంతరం తన వ్యక్తిగత గన్ మెన్ తాసిఫ్, బిల్డర్ నంబూరి మురళిల నూతన గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ..
ఇటీవల మరణించిన భీరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, ఆకుల భాస్కర్ రావు, పెద్ది హైగ్రీవా, దండి కోటయ్యల చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మున్నేరులో ఈతకు వెళ్లి మరణించిన బాలుడు హృదిత్య మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆ కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాలుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో, అజయ్ కుమార్ వెంటనే పోలీస్ కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడి విచారణ జరపాలని కోరారు. అలాగే అనారోగ్యంతో ఉన్న సిపిఐ నాయకులు నూనె శశిని పరామర్శించి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పగడాల నాగరాజు, భీరెడ్డి నాగచంద్రా రెడ్డి, బచ్చు విజయ్ కుమార్, బత్తుల మురళీ, మచ్చా నరేందర్, ముక్కాల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

