చెరువుకు హద్దులు ఏర్పాటు చేయాలి
చిన్న నాగారం గ్రామ పాలకమండలి ఎమ్మార్వో కు వినతి
కాకతీయ ఇనుగుర్తి: మండలంలోని చిన్ననాగారం గ్రామ చెరువును కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకొని వ్యవసాయ సాగు చేస్తున్నారని చెరువుకు హద్దులు ఏర్పాటు చేయాలని చిన్ననాగరం గ్రామ పాలకమండలి తాసిల్దార్ శ్రీనివాస్ కు గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కువ వైశాల్యం కలిగి ఉన్న చెరువును అక్రమించుకొని వరి తదితర పంటలను సాగు చేస్తూ చెరువులు నీరు ఎక్కువగా వాడుకోవడం వల్ల పక్కనే ఉన్న నల్లాల బాయ్ తదితర గ్రామబావులకు కి ఊట తగ్గే ప్రమాదం ఉందని ఇష్ట రీతిగా చెరువు షికంలో భూమిని కలుపుకుంటూ సొంత భూమిలా వాడుకుంటున్నారని రాబోయే రోజుల్లో చెరువును ఆక్రమించుకునే పరిస్థితిలో ఉందని ఇప్పటికైనా చెరువు కు హద్దులు ఏర్పాటు చేసి అన్యాక్రాంతమైన భూమిని స్వాధీనపరుచుకోవాలని ఎమ్మార్వో కు వినతి పత్రం అందజేశామని పాలకమండలి తెలుపుతూ దీనిపై తహసిల్దార్ సానుకూలంగా స్పందించి దీనిపై పూర్తి విచారణ చేపట్టి హద్దులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తుమ్మనపల్లి సతీష్, సర్పంచ్ భర్త చెడుపాక సుజాత యాకయ్య, వార్డు సభ్యులు బైరు వెంకటేశ్వర్లు, నిడిగంటి చంద్రమౌళి, నాయకులు బైరు శ్రీనివాస్ గౌడ్, మునిగంటి రాజు చారి, గుండాల ధర్మయ్య, చెడుపాక వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

