epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
మూడు నెలల్లోపే దరఖాస్తుల కొలిక్కి
అక్కడికక్కడే పరిష్కారానికి ప్రాధాన్యత
మే నెలాఖరు నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
తిరుమలాయపాలెం ప్రజా దర్బార్‌లో మంత్రి పొంగులేటి
కాక‌తీయ‌, కూసుమంచి : ప్రజా దర్బార్‌లో స్వీకరించే ప్రతి దరఖాస్తును మూడు నెలల కాలపరిమితిలోపు పరిష్కరించేలా పక్కా కార్యాచరణ సిద్ధం చేసినట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. శనివారం తిరుమలాయపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండలాన్ని మూడు క్లస్టర్లుగా విభజించి, ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు నిర్వహించిన సభల్లో 14,700 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లు, భూ సమస్యలు, పింఛన్లు, ఉచిత విద్యుత్ కోరుతూ వచ్చినవేనని పేర్కొన్నారు. తక్షణమే పరిష్కరించే వీలున్న వాటిని స్పాట్‌లోనే పూర్తి చేస్తున్నామని, మిగిలిన వాటిని మూడు నెలల గడువులోపే పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
మే నెలాఖరు నుంచి రెండో విడత ఇళ్లు
ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన మొదటి ఏడాదిలోనే 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని మంత్రి గుర్తు చేశారు. ఇంటి నిర్మాణ పురోగతి ఆధారంగా లబ్ధిదారులైన మహిళల బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా నిధులు జమ చేస్తూ పారదర్శకతకు పెద్దపీట వేశామన్నారు. మే నెలాఖరు నుంచి రెండో విడత ఇళ్ల మంజూరు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ తెచ్చిన తప్పుల వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని మంత్రి విమర్శించారు. ఒకే సర్వే నంబర్‌లోని కొంత భూమి సేకరణ జరిగితే.. మొత్తం నంబర్‌ను నిషేధిత జాబితాలో పెట్టడం వంటి అవకతవకలను సరిదిద్దడానికే ‘భూ భారతి’ కార్యక్రమాన్ని తీసుకొచ్చామని వివరించారు. సాదా బైనామా దరఖాస్తులను పేదలకు న్యాయం జరిగేలా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ధాన్యం కొనుగోళ్లపై రైతులకు భరోసా
రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి భరోసా ఇచ్చారు. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నామని, వరితో పాటు మొక్కజొన్నను కూడా పూర్తిస్థాయిలో సేకరిస్తామని తెలిపారు. రైతును రాజును చేయడమే లక్ష్యంగా ఇప్పటికే రూ.2 లక్షల లోపు రుణమాఫీని అమలు చేశామని చెప్పారు. గతంలో రైతులపై బేడీలు వేసిన వారు నేడు కొనుగోలు కేంద్రాల వద్ద విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు, ఆత్మ కమిటీ చైర్మన్, జిల్లా స్థాయి అధికారులు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.