epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మణుగూరులో గుప్త నిధుల వేటగాళ్లు

మణుగూరులో గుప్త నిధుల వేటగాళ్లు
త‌వ్వ‌కాలు సాగించేందుకు క్షుద్ర పూజలు!
ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ నుంచి మంత్రగాళ్ల రాక
నిధి కోసం మూగజీవాల బలి.. నరబలికి కూడా వెనకాడని ముఠా?
అమాయకులను నమ్మించి లక్షల రూపాయల దోపిడీ
వేటగాళ్ల వెనుక కొందరు విలేకరులు, ఓ అధికారి హస్తం?
జేసీబీలతో అడవులను జల్లెడ పడుతున్న వైనం
అంధ విశ్వాసాల‌తో ప‌ల్లెల్లో భ‌యాన‌క వాతావ‌ర‌ణం
కాకతీయ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో గుప్తనిధుల వేటగాళ్లు పడగ విప్పుతున్నారు. రాత్రి వేళల్లో మంత్ర తంత్రాలతో క్షుద్ర పూజలు చేస్తూ, ఎక్కడో నిధులున్నాయన్న భ్రమలో అడవులను, పాత ఇళ్ల పరిసరాలను జల్లెడ పడుతున్నారు. పోలీసుల కళ్లు గప్పి, నిఘా లేని సమయం చూసి జేసీబీ వంటి భారీ యంత్రాలతో సైతం తవ్వకాలు జరుపుతుండటం స్థానికంగా భయాందోళనలకు దారితీస్తోంది. ఒక ముఠాగా ఏర్పడి, నిధుల కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేందుకు వీరు సిద్ధమవుతుండటం గమనార్హం. మరీ ముఖ్యంగా ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి మంత్రగాళ్లను రప్పించి మరీ ‘రెక్కీ’ నిర్వహిస్తుండటం ఈ ముఠా పక్కా వ్యూహరచనకు నిదర్శనంగా మారుతోంది. కేవలం అడవులకే పరిమితం కాకుండా, పవిత్రమైన ఆలయాలను సైతం వీరు వదలడం లేదు. గతంలో మల్లంపాడు చెరువు పక్కన ఉన్న ముత్యాలమ్మ తల్లి ఆలయ గర్భగుడిలో దుండగులు జరిపిన తవ్వకాలు చూసి భక్తులు విస్తుపోయారు. విగ్రహానికి రక్తాభిషేకం చేసి, అక్కడే కోడిని బలి ఇచ్చి ఆరడుగుల గొయ్యి తవ్వడం చూస్తే ఈ ముఠాల క్రూరత్వం మరియు అంధవిశ్వాసాల తీవ్రత అర్థమవుతోంది.
మ‌ణుగూరులోని ఓ ఆల‌యం ముందు త‌వ్విన గుంత‌లు
ఊరూరా గొయ్యిలు.. క్షుద్ర పూజల కలకలం
మణుగూరు పరిసర ప్రాంతాలు ప్రస్తుతం తవ్వకాలతో నిండిపోతున్నాయి. రాజుపేట మారులంపాడు చెరువు సమీపంలో ఎక్కడ చూసినా 10 అడుగుల లోతు గొయ్యిలు దర్శనమిస్తున్నాయి. హనుమాన్ టెంపుల్ రథం గుట్ట, మల్లెపల్లి గోదావరి తీరం, రైల్వే స్టేషన్ మార్గంలోని దర్గా ప్రాంతం, పీవీ కాలనీ క్వార్టర్ల వద్ద కూడా యథేచ్ఛగా తవ్వకాలు జరిగాయి. ఖమ్మంతోగు, బుగ్గ ప్రాంతాలతో పాటు అశ్వాపురం మండలం పాములపల్లి వద్ద కూడా నిధుల వేట కొనసాగుతూనే ఉంది. ఈ ముఠా కేవలం తవ్వకాలకే పరిమితం కాకుండా, అమాయక ప్రజల ఆశను పెట్టుబడిగా మార్చుకుంటోంది. “మీ భూమిలో బంగారం ఉంది.. అది తీయడానికి శక్తివంతమైన మంత్రగాళ్లు కావాలి” అని నమ్మించి పూజల పేరుతో లక్షల రూపాయలు గుంజుతున్నారు. మరికొన్ని చోట్ల ఇనుప రాడ్లకు బంగారు రంగు పూసి, అదే నిధి అని నమ్మించి టోకరా వేస్తున్నారు. తీరా అప్పులు చేసి డబ్బులు కట్టిన తర్వాత.. “గ్రహణం బాగాలేదు.. శక్తులు అడ్డుపడుతున్నాయి” అని మంత్రగాళ్లు తప్పించుకుంటున్నారు. మోసపోయామని తెలిసినా, బయటకు చెబితే తమ పరువు పోతుందని బాధితులు లోలోన మదనపడుతుండటం గమనార్హం.
‘పెద్దల’ అండదండలు.. పోలీసుల నిఘా ఏది?
ఈ చీకటి దందా ఇంత బహిరంగంగా సాగడం వెనుక కొందరు పత్రికా విలేకరుల ప్రమేయం ఉండటం విచారకరం. “మేము చూసుకుంటాం.. ఎవరూ రారు” అంటూ వీరు వేటగాళ్లకు భరోసా ఇస్తూ వాటాలు పంచుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరితో పాటు స్థానికంగా ఉన్న ఒక శాఖకు చెందిన అధికారి కూడా ఈ ముఠాకు ఆశీస్సులు అందిస్తున్నట్లు సమాచారం. తవ్వకాల్లో నిధి దొరికితే ‘సగం-సగం’ పంచుకోవాలనే ఒప్పందాలతో ఈ దందా సాగుతున్నట్లు వినికిడి. మంత్రగాళ్ల రాకతో పల్లెల్లో భయానక వాతావరణం నెలకొంటున్న తరుణంలో, పోలీసులు తక్షణమే స్పందించి ప్రత్యేక నిఘా పెంచాలని, అంధవిశ్వాసాలను ప్రోత్సహిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ముఠాలపై ఉక్కుపాదం మోపాలని మణుగూరు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం కఠినంగా వ్యవహరించకపోతే, ఈ అంధవిశ్వాసాల వేటలో మరిన్ని అపశ్రుతులు చోటుచేసుకునే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.