epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎక్సైజ్ శాఖ ఎక్కడ?

ఎక్సైజ్ శాఖ ఎక్కడ?
భద్రాద్రి జిల్లాలో విచ్చ‌ల‌విడిగా మద్యం సిండికేట్
పేదోడి కడుపు కొడుతున్న బెల్టు షాపులు
ఎంఆర్‌పీ కంటే రూ.40 అదనం
బడి, గుడి అనే తేడా లేదు.. తెల్లవారుజాము నుంచే అమ్మకాలు
మామూళ్ల మత్తులో అధికారులు.. అప్పుల ఊబిలో పేద కుటుంబాలు

కాకతీయ, మ‌ణుగూరు(భద్రాచలం) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మద్యం సిండికేట్లు రెచ్చిపోతున్నాయి. భద్రాచలం, చర్ల, బూర్గంపాడు, సారపాక, లక్ష్మీపురం వంటి ప్రాంతాల్లో బెల్టు షాపులు హద్దు అదుపు లేకుండా వెలుస్తున్నాయి. మద్యం నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో నిర్వాహకులు బరితెగిస్తున్నారు. “మమ్మల్ని ఆపేది ఎవరు?” అంటూ ఏకంగా అధికారులకే సవాళ్లు విసురుతూ, నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. రోజంతా కాయకష్టం చేసి జీవనం సాగించే పేదవాడి సంపాదనను ఈ సిండికేట్ నిర్వాహకులు నిలువునా దోచుకుంటున్నారు.

సమయపాలన లేదు.. నిబంధనలు లేవు

గ్రామాల్లో ఎటువంటి అనుమతులు లేకుండానే కిరాణా షాపులు, హోటళ్లు బెల్టు షాపులుగా మారిపోయాయి. బడి, గుడి అనే విచక్షణ లేకుండా జనసమ్మర్థం ఉన్న ప్రాంతాల్లో సైతం తెల్లవారుజాము నుంచే మద్యం అమ్మకాలు మొదలవుతున్నాయి. మద్యం బాటిల్‌పై ఎంఆర్‌పీ కంటే రూ. 20 నుంచి రూ. 40 వరకు అదనంగా వసూలు చేస్తూ సామాన్యులను పీడిస్తున్నారు. ప్రధాన రహదారుల పక్కన మద్యం విక్రయించకూడదనే నిబంధన ఉన్నా.. దర్జాగా రోడ్ల పక్కనే దుకాణాలు నడుస్తున్నాయి. ఈ విచ్చలవిడి అమ్మకాల వల్ల గ్రామాల్లో తరచూ గొడవలు జరుగుతుండటంతో మహిళలు, వృద్ధులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

ఛిన్నాభిన్నమవుతున్న నిరుపేద కుటుంబాలు

మద్యం మహమ్మారి కారణంగా ఏజెన్సీలోని నిరుపేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. చేసిన కూలీ డబ్బులన్నీ తాగుడికే ఖర్చు చేస్తుండటంతో పసిపిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. ముఖ్యంగా యువత మద్యానికి బానిసవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు మద్యానికి బానిసైన వ్యక్తులు అనారోగ్యం పాలవుతుంటే, మరోవైపు గృహహింస పెరిగిపోతోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయి అనేక కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతూ అటువైపు కన్నెత్తి చూడటం లేదని ప్రజలు మండిపడుతున్నారు.

అధికారుల నిర్లక్ష్యంపై నిరసనలు

బెల్టు షాపులను అరికట్టలేనప్పుడు ఎక్సైజ్ శాఖకు జీతాలు ఎందుకని పలు ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. సామాన్య ప్రజలు కట్టే పన్నులతో జీతాలు తీసుకుంటూ.. సిండికేట్లకు కొమ్ముకాస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహించి, బెల్టు షాపులను శాశ్వతంగా నిషేధించాలని ఏజెన్సీ ప్రాంత వాసులు కోరుతున్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.