epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆగని ‘మద్యం’ సిండికేట్ దందా

ఆగని ‘మద్యం’ సిండికేట్ దందా
ప్రభుత్వం ధర ఒకటి.. సిండికేట్ బాదుడు మరొకటి
భద్రాచలం ఏజెన్సీలో విచ్చిల విడిగా బెల్ట్ షాపులు
మ‌ద్యం ఏరులై పారుతున్న ప‌ట్టించుకోని ఎక్సైజ్ శాఖ‌
అధిక ధ‌ర‌ల‌కు మ‌ద్యం విక్ర‌యాల‌కు ప్రొత్సాహం
సామాన్యుల జేబులకు చిల్లులు.. వ్యాపారులకు కోట్ల ఆదాయం
నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఎక్సైజ్ అధికారులు
చర్యలు తీసుకోవాలంటూ ప్రజా సంఘాల డిమాండ్

కాకతీయ, మణుగూరు (భద్రాచలం) : భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో మద్యం అక్ర‌మ‌ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. నిబంధనల ప్రకారం మద్యం విక్రయాలు జరగాల్సి ఉండగా, ఇక్కడ మాత్రం సిండికేట్లే శాసనకర్తలుగా మారారు. మణుగూరు, భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపహాడ్ వంటి మండలాల్లో మద్యం వ్యాపారులు సిండికేట‌య్యారు. ఒక ముఠాగా ఏర్పడి మద్యం ప్రియులను నిలువునా దోచుకుంటున్నాయి. ప్రతి సీసాపై ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అదనంగా వసూలు చేస్తూ సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. అక్రమ సంపాదనతో వ్యాపారులు జేబులు నింపుకుంటున్నా, అడ్డుకోవాల్సిన అధికారులు మాత్రం ‘మాకేమీ పట్టనట్లు’ వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వ ధర ఒకటి.. సిండికేట్ రేటు మరొకటి!

మద్యం దుకాణాల వద్ద ధరల పట్టికలు ప్రదర్శించాలన్న నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. బెల్టు షాపుల దందా ఏజెన్సీ గ్రామాల్లో కుగ్రామాల వరకు విస్తరించింది. ప్రతి క్వార్టర్ సీసాపై రూ. 10 నుంచి రూ. 20 వరకు, బీర్లపై రూ. 20 నుంచి రూ. 30 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రధాన దుకాణాల కంటే బెల్టు షాపుల్లోనే విక్రయాలు ఎక్కువగా సాగుతున్నాయి. సిండికేట్ వ్యాపారులు గోదాముల నుంచి నేరుగా బెల్టు షాపులకు మద్యం తరలిస్తూ అక్రమ విక్రయాలను ప్రోత్సహిస్తున్నారు. దీనివల్ల సామాన్య కూలీలు, మద్యానికి బానిసైన వారు ఆర్థికంగా చితికిపోతూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

కోట్లు దోపిడీ జరుగుతున్నా మౌనం ఎందుకు?

సిండికేట్ల దోపిడీపై మీడియాలో కథనాలు వస్తున్నా, స్థానికులు మొరపెట్టుకుంటున్నా ఎక్సైజ్ అధికారులు మాత్రం కళ్లు మూసుకుని కూర్చున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఈ అక్రమ విక్రయాలు ఎవరి ప్రయోజనాల కోసం సాగుతున్నాయని ప్రజా సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. అధికారుల అండదండలు లేనిదే ఇంత పెద్ద ఎత్తున సిండికేట్ దందా సాధ్యం కాదని, మామూళ్ల మత్తులో పడి అధికారులు అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారని విమర్శిస్తున్నారు. మండలంలోని పలు పంచాయతీల్లో మద్యం దందా అదుపు తప్పిందని, తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఎంఆర్‌పీ ధరలకే మద్యం విక్రయించేలా చూడాలని, బెల్టు షాపులను పూర్తిగా రద్దు చేయాలని కోరుతున్నారు. లేనిపక్షంలో ఏజెన్సీ ప్రాంతంలో సామాన్యుల బతుకులు మరింత దుర్భరంగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.