ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కలెక్టర్ సన్మానం
కాకతీయ, నెల్లికుదురు/ ఇనుగుర్తి: పాఠశాల విద్యాశాఖ మహబూబాద్ జిల్లా ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 2026 విద్యా వారోత్సవాలు విజయోత్సవం లో భాగంగా 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ జిల్లా టాపర్లను మరియు జాతీయస్థాయి ఆటల పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు ప్రోత్సాహాలు ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు.
జడ్పిహెచ్ఎస్ ఆలేరు హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్న బానోతు యశ్వంత్ ఇటీవల నిర్వహించిన జాతీయస్థాయి రబ్బీ పోటీల్లో, ఇనుగుర్తి జెడ్ పి హెచ్ ఎస్ లో 8వ తరగతి చదువుతున్న బొల్లు సహస్ర జాతీయస్థాయి స్టాఫ్ బాల్ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన ప్రతిభ కనబరిచిన వీరిద్దరికి కలెక్టర్ స్నేహ శబరిష్ మరియు ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు, డి ఈ ఓ సత్యనారాయణ మూర్తి, ఎంఈఓలు రామదాసు రూపా రాణి మరియు ఎస్ జి ఎఫ్ ఐ సెక్రెటరీ గండి సత్యనారాయణ, ఎస్ జి ఎఫ్ అసిస్టెంట్ సెక్రటరీ ఐలయ్య చేతుల మీదుగా ప్రోత్సాహకంగా 10,000/- రూపాయలు నగదు బహుమతి మరియు మెమెంటో . మెమొంటో అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ లు తాళ్ల ప్రణయ్, మహమ్మద్ ఇమామ్ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

