epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రైతులకు అందుబాటులో బ్యాంకింగ్ సేవలు

రైతులకు అందుబాటులో బ్యాంకింగ్ సేవలు
సహకార బ్యాంకు బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
మానుకోట ఎమ్మెల్యే  భూక్య మురళి నాయక్ 
నెల్లికుదురులో  డీసీసీబీ శాఖ కార్యాల‌యాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే 
కాకతీయ, నెల్లికుదురు: రైతులకు, సామాన్య ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువయ్యేలా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) నూతన శాఖను ఏర్పాటు చేయడం అభినందనీయమని మహబూబాబాద్ శాసనసభ్యుడు భూక్య మురళి నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన డీసీసీబీ బ్యాంకు శాఖను మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళి నాయక్ మాట్లాడుతూ నెల్లికుదురు మండల ప్రజలకు, ముఖ్యంగా నిరుపేద రైతులకు, సామాన్య ప్రజానికానికి బ్యాంకింగ్ సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు ఈ నూతన శాఖ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
తక్కువ వడ్డీకే పంట, బంగారు రుణాలు
తెలంగాణ ప్రభుత్వం సహకార రంగం బలోపేతానికి, రైతాంగ సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వాణిజ్య బ్యాంకులతో పోటీపడుతూ డీసీసీబీ తక్కువ వడ్డీకే రైతులకు పంట రుణాలు, బంగారు రుణాలు అందిస్తూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తోందన్నారు. దీనితో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్ వంటి సేవలను కూడా సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడం హర్షణీయమన్నారు. మండల ప్రజలు, రైతులు, వ్యాపారస్థులు ఈ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా వృద్ధి సాధించాలని కోరారు. ముఖ్యంగా బ్యాంకు అధికారులు కూడా ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్నేహపూర్వకంగా సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్, జిల్లా సహకార అధికారి వెంకటేశ్వర్లు, నాబార్డు జిల్లా అభివృద్ధి మేనేజర్ రామ్ చౌరి, నెల్లికుదురు డీసీసీబీ బ్యాంకు మేనేజర్ శోభన్, నెల్లికుదురు గ్రామ సర్పంచ్ పులి వెంకన్న, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) చైర్మన్లు, ముఖ్య కార్యనిర్వహణ అధికారులు (సీఈఓలు), జిల్లా, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.