epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆసుపత్రి కార్మికుల సమస్యలు తీర్చాలి

ఆసుపత్రి కార్మికుల సమస్యలు తీర్చాలి
కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి
డీఎంఈ కార్యాలయం ఎదుట కార్మికుల ధ‌ర్నా
టీవీవీపీ కమిషనర్‌ డాక్టర్ అజయ్ కుమార్‌కు వినతి అంద‌జేత‌
కాకతీయ, ఖమ్మం : తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కళాశాలల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ, సూపర్వైజర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం హైదరాబాద్‌లోని డీఎంఈ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ (ఎస్పీఎస్ ఎం అండ్ హెచ్ డబ్ల్యు) ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన అనంతరం టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కుర్రి సైదయ్య మాట్లాడుతూ, రెండు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నా తమకు తగిన గుర్తింపు లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 17,800 మంది కార్మికులు చాలీచాలని జీతాలతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, దీనివల్ల కొన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు, ఏజెన్సీ దారులు ఇష్టారీతిన అతి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని, మూడు నెలలు పనిచేస్తే ఒక నెల వేతనం ఇస్తూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. చాలా ఆసుపత్రుల్లో కార్మికులకు ఈపీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించడం లేదని, దీనిపై ప్రశ్నించిన వారిని విధులకు రావద్దంటూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఆసుపత్రుల్లో సమయపాలన లేకుండా ఓవర్‌టైమ్ డ్యూటీలు చేయిస్తూ, నెలకు కేవలం మూడు రోజులు మాత్రమే సెలవులు ఇస్తున్నారని లబోదిబోమన్నారు. కార్మికుల సమస్యలపై సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్న బోస్కా నరేష్ మాట్లాడుతూ, కనీస వేతన చట్టం ప్రకారం కార్మికులకు నెలకు రూ.26,000 వేతనం చెల్లించాలని, అలాగే ఫిక్స్డ్ వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. బెడ్ సైడ్ కాంట్రాక్ట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, ఐహెచ్ఎఫ్ఎంఎస్ నుండి ఎఎఫ్ఎంఐఎస్ లో విలీనం చేయాలన్నారు. దీంతో పాటు కార్మికులకు రూ.10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, ఈపీఎఫ్ లో యాజమాన్యం వాటాను ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. మహిళా కార్మికులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే క్యాజువల్ సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులపై అనునిత్యం వేధింపులకు పాల్పడితే సహించేది లేదని, వారి హక్కుల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఇసనపల్లి అంబేద్కర్, ప్రధాన కార్యదర్శి కర్ష జగదీష్, కోశాధికారి బత్తుల మమత, గౌరవ సలహాదారులు నాగేశ్వరరావు, రాధా మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.