epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వడదెబ్బతో టైలర్ మృతి

వడదెబ్బతో టైలర్ మృతి
ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూత
కాకతీయ,ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారంలో వడదెబ్బతో టైలర్ మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఏటూరునాగారం గ్రామానికి చెందిన వెంకన్న (41) అనే టైలర్ కొద్ది రోజుల క్రితం తన అత్తగారి ఇంటికి వెళ్లిన సమయంలో తీవ్ర ఎండల ప్రభావంతో వడదెబ్బకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్ ద్వారా ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. వెంకన్న మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మండలంలో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు వెళ్లొద్దని, తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
వడదెబ్బతో రైతు మృతి
కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారంమండలంలోని ఓడగూడెంకు చెందిన రైతు కర్ల నర్సయ్య వడదెబ్బ కారణంగా మృతి చెందారు. ఈ నెల 25వ తేదీన తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు స్థానిక వరప్రసాద్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు.
వడదెబ్బతో ట్రాక్టర్ డ్రైవర్ మృతి
ఇసుక తోలకానికి వెళ్లివచ్చి నిద్రలోనే కన్నుమూత
కాకతీయ, నూగూరు వెంకటాపురం : తీవ్రమైన వడదెబ్బ కారణంగా ఓ ట్రాక్టర్ డ్రైవర్ నిద్రలోనే ప్రాణాలు కోల్పోయిన సంఘటన మండల పరిధిలోని సూరవీడు కాలనీ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక పోలీస్ అధికారి కె. తిరుపతి రావు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తాటి నరేష్ (34) వృత్తిరీత్యా ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మే 25న నరేష్ ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలో ఇసుక తోలకానికి వెళ్లాడు. రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి పడుకున్నాడు. మరుసటి రోజు (మే 26) ఉదయం 6 గంటల సమయంలో భార్య భవాని లేచి చూసేసరికి నరేష్ మంచంపై చేతులు గుంజుకుపోయి, అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఆందోళన చెందిన భార్య వెంటనే మామ తాటి చిన్నికి సమాచారం అందించింది. కుటుంబ సభ్యులు స్థానిక ఆశా వర్కర్‌ను పిలిపించి చూపించగా, నరేష్ అప్పటికే మృతి చెందినట్లు ఆమె ధృవీకరించింది. తీవ్రమైన ఎండలో ఇసుక తోలకం చేయడం వల్లే వడదెబ్బ తగిలి నిద్రలోనే సొమ్మసిల్లి చనిపోయాడని మృతుడి తండ్రి తాటి చిన్ని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడి దరఖాస్తు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అంతా ఈశ్వర మాయ!

అంతా ఈశ్వర మాయ! లాగిన్‌ నుంచి రహదారి తనిఖీల దాకా అక్రమాలు విధుల్లో లేని...

ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు!

ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు! నర్సంపేట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అడ్డగోలు వ్యవహారం? 2 మండలాల్లో పంచాయతీ...

సీట్ల‌కు అంటుకుపోయారు!

సీట్ల‌కు అంటుకుపోయారు! రెవెన్యూ విభాగంలో పాతుకుపోయిన ఆర్ఐలు బదిలీ నిబంధనలు నీటి మూటలేనా? 6 ఏళ్లుగా...

నేను చెప్పిందే వేదం..నా మాటే శాసనం’

నేను చెప్పిందే వేదం..నా మాటే శాసనం’ ఇష్టారాజ్యంగా ములుగు డీటీవో ఈశ్వ‌ర్...

ప్రజల మనసుల్లో చల్లా ధర్మారెడ్డి

ప్రజల మనసుల్లో చల్లా ధర్మారెడ్డి పరకాల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు మౌలిక వసతుల...

420 హామీలు అమలులో కాంగ్రెస్‌ విఫలం

420 హామీలు అమలులో కాంగ్రెస్‌ విఫలం రైతులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టింది రుణమాఫీ, రైతుభరోసా,...

దొరల పాలన కాదు.. ప్రజా పాలన

దొరల పాలన కాదు.. ప్రజా పాలన దళిత స్పీకర్‌ను అవమానిస్తే సహించేది లేదు తాతా...

క‌డియం సిగ్గుప‌డు..!

క‌డియం సిగ్గుప‌డు..! కేసీఆర్‌ దళితులకు ఏం చేయలేదా.?! ఎన్టీఆర్‌ తర్వాత నీకు రాజకీయ బిక్ష...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.