epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సుమలత హత్య కేసులో కత్తి కాశిబుగ్గదే!

సుమలత హత్య కేసులో కత్తి కాశిబుగ్గదే!
ఏనాడో హెచ్చరించిన కాకతీయ దినపత్రిక
మారణాయుధాలను తలపించేలా కత్తుల వ్యాపారం
కాశిబుగ్గ నడిరోడ్డుపైనే కత్తుల తయారీ కేంద్రాలు
వివేకానంద కాలేజీ ఆనుకుని ఎగ్జిబిషన్ దుకాణాలు
ఈ ఏరియా ఇప్పటికే రౌడీషీటర్లకు అడ్డాగా మారిన వైనం
అయినా ఈ వ్యాపారంపై దృష్టిసారించని పోలీసులు
బహిరంగంగా కత్తులు కనిపిస్తున్నా కట్టడి చేయడంలో విఫలం
ఓ మహిళను హత్య చేయడంలో కత్తి ఇక్కడే కొన్న దుర్మార్గుడు
భవిష్యత్ లో హత్యాయుధాలకు కాశిబుగ్గ నెలవుగా మారే ప్రమాదం

కాకతీయ, వరంగల్ : సినిమాల్లో కనిపించే పొడవాటి, పెద్దపెద్ద వంకలు తిరిగిన కత్తులు వరంగల్ మహానగరంలోని కాశిబుగ్గ నడిరోడ్డుపై బహిరంగంగానే విక్రయిస్తున్నారు. నిత్యం వందలాది మంది రాకపోకలు సాగించే వివేకానంద కాలేజీని ఆనుకుని ఉన్న ఎగ్జిబిషన్ దుకాణాల్లో మారణాయుధాలను తలపించేలా సాగుతున్న ఈ కత్తుల వ్యాపారం ఇప్పుడు ఒకరి ప్రాణం తీసేందుకు కారణమైంది.
కాశిబుగ్గ నడిబొడ్డున సాగుతున్న ఈ కత్తుల తయారీ, విక్రయాల వల్ల శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉందని, ఎవరి ప్రాణాలకైనా ముప్పు పొంచి ఉందని ‘కాకతీయ’ దినపత్రిక నాలుగు నెలల క్రితమే ప్రత్యేక కథనంతో పోలీసులను హెచ్చరించింది. పత్రికా కథనాలను పోలీసులు లైట్ తీసుకున్నారో ఏమో కానీ.. అనుకున్నట్టే ఒక దుర్మార్గుడి చేతిలో ఇక్కడి కత్తి ఓ మహిళ పాలిట యమపాశంగా మారింది. ఈ నెల 20న వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్ష్మీపురం గ్రామంలో తాళ్లపెల్లి సుమలత అనే మహిళ దారుణ హత్యకు గురైంది. నిందితుడు ఆమెను విచక్షణారహితంగా నరికి చంపడానికి ఉపయోగించిన ఆ పెద్ద కత్తిని కాశిబుగ్గలోనే కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక్కడి కత్తి ఒకరి దారుణ హత్యకు కారణం కావడం పోలీసుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలుస్తోందని స్థానికులు మండిపడుతున్నారు.

రౌడీషీటర్ల అడ్డాలో కత్తుల దుకాణాలా?
పోలీసు రికార్డుల ప్రకారమే కాశిబుగ్గ ఏరియా ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతంగా ఉంది. ఇక్కడ ఎంతో మందిపై రౌడీషీట్లు ఉన్నాయి. రెండు రోజుల క్రితమే స్థానిక రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. ఇంతటి హిస్టరీ ఉన్న ప్రాంతంలో, దుకాణాలకు ఎదురుగానే పోలీసులు నిత్యం వాహన తనిఖీలు చేస్తున్నా.. మారణాయుధాల్లాంటి కత్తులు బహిరంగంగా అమ్ముతున్నా పట్టించుకోకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఒకప్పుడు కూరగాయలు కోసే చిన్న చాకులు, కత్తిపీటలు చేసిన ఈ కేంద్రాల్లో.. ఇప్పుడు సినిమాల తరహా కత్తులు తయారు చేస్తున్నారు. ఈ ప్రాంత రైతులు కూడా అంత పెద్ద కత్తులను వాడరు.. మరి వీటిని ఎవరి కోసం తయారు చేస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ కత్తులు కొనేవారి వివరాలు గానీ, రికార్డులు గానీ ఉండటం లేదు.

ఇప్పటికైనా కట్టడి చేయాలి
సుమలత హత్యోదంతంతోనైనా పోలీసులు కళ్లు తెరవాలని ప్రజలు కోరుతున్నారు. నగరంలో కత్తుల వ్యాపారం బహిరంగంగా జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉంది. ఒకవేళ వ్యవసాయ అవసరాల కోసం విక్రయించాల్సి వస్తే.. కొనుగోలు చేసే వారి గుర్తింపు కార్డులు (ఆధార్ జీరాక్స్) వంటి ప్రతులు, ఫోన్ నంబర్లు తప్పనిసరిగా సేకరించేలా నిబంధనలు తీసుకురావాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో ఘోరమైన నేరాలకు కాశిబుగ్గ కేంద్రంగా మారే ప్రమాదం ఉందని వరంగల్ నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.