epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మీ సేవలు ఆదర్శనీయం

మీ సేవలు ఆదర్శనీయం
రిటైర్డ్ జీవితం ప్ర‌శాంతంగా గ‌డ‌పాలి
ఆరోగ్యాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
పదవీ విరమణ పొందిన పోలీసుల‌కు ఎస్పీ రోహిత్ రాజు స‌త్కారం
సుదీర్ఘ కాలం పాటు పోలీస్ శాఖకు విశేష సేవలు

కాకతీయ, కొత్తగూడెం: పోలీస్ శాఖలో ఎన్నో ఏళ్లుగా బాధ్యతాయుతమైన విధులు నిర్వహిస్తూ ప్రజలకు ఎనలేని సేవలందించి పదవీ విరమణ పొందిన ఒక ఎస్ఐ, ఏఎస్ఐ, ఏఆర్ ఎస్ఐ మరియు హెడ్ కానిస్టేబుల్‌లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శనివారం ఘనంగా సత్కరించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు ఈ వీడ్కోలు సన్మాన కార్యక్రమం అత్యంత ఆత్మీయ వాతావరణంలో జరిగింది. పదవీ విరమణ పొందిన నలుగురు పోలీసు అధికారులను ఎస్పీ రోహిత్ రాజు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి, వారి సేవలను కొనియాడుతూ ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రిటైర్డ్ అధికారులు మరియు వారి కుటుంబ సభ్యులు పోలీస్ శాఖలో తమకున్న సుదీర్ఘ అనుభవాలను, జ్ఞాపకాలను ఎస్పీతో పంచుకున్నారు.

రిటైర్మెంట్ పొందిన పోలీస్ అధికారుల వివరాలు:
కసిబోయిన సత్యనారాయణ రాజు (ఎస్సై): పోలీస్ శాఖలో ఏకంగా 42 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలు అందించి పదవీ విరమణ పొందారు. ధారావత్ వెంకటేశ్వర్లు (ఏఆర్ ఎస్ఐ): పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు విధులు నిర్వహిస్తూ, 41 సంవత్సరాల పాటు శాఖకు సేవలు అందించి రిటైర్ అయ్యారు. జంపాల హనుమంతరావు (ఏఎస్సై): 37 సంవత్సరాల పాటు పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో పనిచేసి శనివారం పదవీ విరమణ చేశారు. ఎట్టా శ్రీనివాసరావు (హెడ్ కానిస్టేబుల్): అశ్వాపురం పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వర్తిస్తూ, 36 ఏళ్ల సర్వీసును పూర్తి చేసుకుని పదవీ విరమణ పొందారు.

సీనియర్ల అనుభవాలను సిబ్బంది స్ఫూర్తిగా తీసుకోవాలి: ఎస్పీ
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ.. దశాబ్దాల పాటు పోలీస్ శాఖలో కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటూ ప్రజల రక్షణ కోసం పనిచేసిన అధికారుల సేవలు ఎంతో ఆదర్శనీయమన్నారు. నూతనంగా పోలీస్ శాఖలో భర్తీ అయిన యువ అధికారులు, సిబ్బంది వీరి అనుభవాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పదవీ విరమణ పొందిన అధికారులు తమ శేషజీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా, ప్రశాంతంగా గడపాలని ఆకాంక్షించారు. వయసు రీత్యా దైనందిన జీవితంలో వ్యాయామం, యోగా, ధ్యానం వంటివి అలవాటు చేసుకుని తమ ఆరోగ్యాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. రిటైర్డ్ సిబ్బందికి ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావచ్చని భరోసా ఇచ్చారు. అలాగే, వీరికి ప్రభుత్వం నుంచి అందవలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ (ఆర్థిక ప్రతిఫలాలు) త్వరితగతిన అందేలా చూడాలని కార్యాలయ అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఈ గౌరవ వందన సన్మాన కార్యక్రమంలో డీసిఆర్బి డిఎస్పి మల్లయ్య స్వామి, ఏఆర్ డిఎస్పి సత్యనారాయణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మంజ్య, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు, ఎంటిఓ సుధాకర్, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణ, జిల్లా పోలీస్ అధికారుల సంఘం సభ్యులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.