epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జనసేనలోకి గడల

జనసేనలోకి గడల
కోవిడ్ సమయంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం
శ్రీనివాసరావు రాక పార్టీకి మరింత బలాన్ని ఇస్తుంది
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
సమాజ సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాను
తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను : గ‌డ‌ల‌

కాకతీయ, కొత్తగూడెం : తెలంగాణ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మాజీ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు జనసేన పార్టీలో చేరారు. బుధవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో గడల శ్రీనివాసరావుకు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ డాక్టర్ గడల శ్రీనివాసరావు కుటుంబంతో తమ కుటుంబానికి ఎంతో కాలంగా సన్నిహిత అనుబంధం ఉందన్నారు ప్రజాసేవ పట్ల అంకితభావం కలిగిన అధికారిగా ఆయన ప్రజల్లో విశేష గౌరవం సంపాదించుకున్నారని పేర్కొన్నారు.

కరోనా సేవలు చిరస్మరణీయం
ప్రభుత్వ వైద్యుడిగా ప్రారంభమైన ఆయన సేవా ప్రస్థానం ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ స్థాయికి చేరుకోవడం ఆయన కృషికి నిదర్శనమన్నారు. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు డాక్టర్ గడల శ్రీనివాసరావు వంటి అనుభవజ్ఞులు జనసేనలో చేరడం పార్టీకి మరింత బలాన్ని తీసుకువస్తుందని తెలిపారు సమాజ సేవను లక్ష్యంగా పెట్టుకుని రాజకీయాల్లోకి వస్తున్న ఆయన తెలంగాణలో పార్టీ విస్తరణకు కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆలోచించి తీసుకున్న నిర్ణయం
అనంతరం డాక్టర్ గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్‌తో తన అనుబంధం మెగాస్టార్ చిరంజీవి ద్వారా ప్రారంభమైందని తెలిపారు. కాలక్రమేణా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ప్రజా సమస్యల పట్ల ఆయనకున్న నిబద్ధత తనను ప్రభావితం చేశాయని పేర్కొన్నారు. తాను జనసేనలో చేరడం భావోద్వేగపూరిత నిర్ణయం కాదని సమాజానికి మరింత విస్తృత స్థాయిలో సేవ చేయాలనే సంకల్పంతో తీసుకున్న ఆలోచిత నిర్ణయమని స్పష్టం చేశారు. యువతకు ఆశయాలను అందించే నాయకత్వం పవన్ కళ్యాణ్‌లో కనిపించిందని అన్నారు.

పార్టీ బలోపేతానికి కృషి
ఇకపై జనసైనికుడిగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా తెలంగాణలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా వైద్య ఆరోగ్య రంగానికి చెందిన సిబ్బందికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తన ప్రభుత్వ సేవా కాలంలో అందించిన సహకారం భవిష్యత్తులో కూడా కొనసాగించాలని ఆకాంక్షించారు. కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు వాస్తవ సమాచారాన్ని చేరవేయడంలో తనతో కలిసి పనిచేసిన మీడియా మిత్రులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.