రాజేష్ కుటుంబానికి ఆర్థిక సాయం
రూ.పది వేల నగదు, బియ్యం అందజేసిన వర్తక సంఘం
దివ్యాంగ కుమారుడున్న కుటుంబానికి అండగా ఉంటామని హామీ
కాకతీయ,పినపాక : పినపాక మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన పులపగిరి రాజేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన కుటుంబానికి బయ్యారం క్రాస్ రోడ్ వర్తక సంఘం అండగా నిలిచింది. వర్తక సంఘం ప్రెసిడెంట్ గుండు సురేష్ ఆధ్వర్యంలో సంఘం సభ్యులు రూ. 10,000 నగదుతో పాటు 25 కేజీల బియ్యాన్ని రాజేష్ భార్య దేవకికి స్థానిక సర్పంచ్ అనిత చేతుల మీదుగా అందజేశారు. ఇటీవలే భర్తను కోల్పోవడం, కుమారుడు దివ్యాంగుడు కావడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ కుటుంబానికి మానవతా దృక్పథంతో ఈ సహాయం అందించినట్లు వర్తక సంఘం ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో కూడా అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం సభ్యులు కమలాకర్, సలహాదారులు వెన్న భాస్కర్ రెడ్డి, ట్రెజరర్ వెలదండి లక్ష్మణరావు, గంజాయి మురళి, మోహన్‌రావు, డాక్టర్ రాంబాబు, జాడి మహేష్, వేణుగోపాల చారి, గోల్డ్ షాప్ లక్ష్మణ్ చారి తదితరులు పాల్గొన్నారు.

