ఘనంగా దండు సారయ్య జన్మదిన వేడుకలు
ముగిసిన రెండు తెలుగు రాష్ట్రాలస్థాయి డాన్స్ పోటీలు
కళలను ప్రోత్సహించడంలో తానెప్పుడూ ముందే ఉంటా
13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్య
కాకతీయ, ఇల్లందు : ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్య జన్మదిన వేడుకలు ఆదివారం రాత్రి అట్టహాసంగా జరిగాయి. ఈ మేరకు జననేత దండు సారయ్య జన్మదిన వేడుకల నడుమ వెంకట్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో విబిసిసి సహకారంతో సీఈఆర్ క్లబ్లో నిర్వహించిన తెలంగాణ–ఆంధ్ర రెండు రాష్ట్రాలస్థాయి డాన్స్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా దండు సారయ్యతో భారీ కేక్ కట్ చేయించి గజమాలతో సత్కరించారు. వందలాది మంది కళాకారులు పాల్గొన్న ఈపోటీల్లో విజేతలకు దండు సారయ్య చేతులమీదుగా నగదు బహుమతులు, షీల్డులు, సర్టిఫికెట్లు అందజేశారు. సీనియర్స్ గ్రూప్ విభాగంలో నాచురల్ నవీన్ టీమ్(వరంగల్), ఎంజే అశోక్ టీమ్(మణుగూరు) ప్రథమ బహుమతి, కళ్యాణ్ టీమ్(భూపాలపల్లి) ద్వితీయ బహుమతి, గణేష్ టీమ్(భూపాలపల్లి) తృతీయ బహుమతి సాధించగా, జూనియర్స్ గ్రూప్ విభాగంలో వనపర్తి టీమ్ ప్రథమ, ఎంజే అశోక్ టీమ్(మణుగూరు) ద్వితీయ, ప్రసంగి టీమ్(జమ్మికుంట), బిట్ బిట్ ప్రశాంత్ టీమ్(గోదావరిఖని) తృతీయ బహుమతులు పొందాయి. సీనియర్ సోలో విభాగంలో అభి(విశాఖపట్నం) ప్రథమ, పరమేష్ కుమార్(హైదరాబాద్) ద్వితీయ, లాస్య(జమ్మికుంట)తృతీయ బహుమతి సాధించారు. ఈ సందర్భంగా దండు సారయ్య మాట్లాడుతూ..యువ కళాకారులను ప్రోత్సహించడం ప్రతిఒక్కరి బాధ్యత అని, కళలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆయన తెలిపారు. వెంకట్ డాన్స్ అకాడమీ వ్యవస్థాపకుడు కడారి వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆకుల లక్ష్మి, పాబోలు స్వాతి, కిరణ్, పింగళి అనన్య నరేష్, ఓంగూరి శ్రీనివాస్, దాసరి గోపాలకృష్ణ, రవినాయక్, కడారి నటరాజ్, సర్వేశ్ మాస్టర్, రమేష్ మాస్టర్, ప్రభురాజు మాస్టర్, నవ్య మౌనిక మాస్టర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించగా సాయి మాస్టర్, శ్రీకాంత్ మాస్టర్, శేఖర్ మాస్టర్, రాజేష్ మాస్టర్, సాయికిరణ్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.


