epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సత్తుపల్లి ఫుడ్ పార్క్‌లో భారీ కుంభకోణం

సత్తుపల్లి ఫుడ్ పార్క్‌లో భారీ కుంభకోణం
రైతుల ఆశలను కార్పొరేట్లకు తాకట్టు పెట్టారు
రూ.109 కోట్ల ప్రాజెక్టులో నిబంధనలకు పాతర
నిజానిజాలు తేల్చడానికి శ్వేతపత్రం విడుదల చేయాలి
భూకేటాయింపుల వెనుక స్థానిక ముఖ్య నేతల హస్తం
సీబీఐ దర్యాప్తు జరగాలి : బీజేపీ జాతీయ నాయ‌కుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి
సత్తుపల్లి ఫుడ్ పార్క్ అక్రమాలపై క్షేత్రస్థాయిలో బీజేపీ నిరసన

కాక‌తీయ‌, ఖ‌మ్మం బ్యూరో/ సత్తుపల్లి : వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి కోసం, స్థానిక రైతులకు అండగా నిలుస్తుందనే ఆశతో ఏర్పాటు చేసిన సత్తుపల్లి మెగా ఫుడ్ పార్క్ చివరకు పెద్ద కుంభకోణానికి వేదికగా మారిందని బీజేపీ జాతీయ నాయకులు, కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాల కో-ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపణలు చేశారు. బుధవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని ఫుడ్ పార్క్‌ను బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావుతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడ జరుగుతున్న వ్యవహారాలను, నిర్మాణాలను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫుడ్ పార్క్ వ్యవహారంలో పారదర్శకత పూర్తిగా లోపించిందని, ఈ భారీ అక్రమాల వెనుక ఈ ప్రాంతానికి చెందిన ముఖ్య నాయకుల ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. మెగా ఫుడ్ పార్క్ స్కీమ్ కింద కోల్డ్ స్టోరేజీతో కూడిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును వ్యవసాయ ఆధారిత ప్రొడక్ట్ ల కోసం, రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో రూ.109.50 కోట్ల అంచనా వ్యయంతో రూపకల్పన చేశారని పొంగులేటి గుర్తు చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని కాంక్షించి తన వంతుగా ఏకంగా రూ.49.70 కోట్ల భారీ నిధులను కేటాయించిందని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర కేవలం భూములను సేకరించి ఇవ్వడం మాత్రమేనని, కానీ ఆ ప్రక్రియలోనే పాలకులు అత్యంత దారుణమైన అక్రమాలకు తెరలేపారని ఆరోపించారు. స్థానిక రైతుల నుంచి కేవలం లక్ష, రెండు లక్షల రూపాయల చొప్పున అత్యంత తక్కువ ధరకే భూములను గుంజుకుని, ఈ రోజు వాటిని కార్పొరేట్ శక్తులకు యథేచ్ఛగా ధారాదత్తం చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు.

రైతులు ప్రాణప్రదమైన భూములను అప్ప‌గించారు..

తమకు సరైన పరిహారం రాకపోయినా, భవిష్యత్తులో ఈ పార్క్ ద్వారా తమ పిల్లలకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయనే పవిత్ర ఆశయంతోనే రైతులు తమ ప్రాణప్రదమైన భూములను ప్రభుత్వానికి అప్పగించారని పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. కానీ చివరకు ఆ నిరుపేద రైతుల ఆశలను అడియాశలు చేస్తూ, పారదర్శకతకు పూర్తిగా పాతరవేశారని మండిపడ్డారు. అసలు ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా, ఆంధ్రాకు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీకి ఏకంగా 84 ఎకరాల భూమిని కేటాయించడం వెనుక ఉన్న అసలు ఆంతర్యం ఏమిటని ఆయన నిలదీశారు. దీనితో పాటు దీపక్ నెక్స్ జెన్ కంపెనీకి మార్కెట్ ధరలో సగానికంటే తక్కువ ధరకే భూములను అప్పగించడం వెనుక ఎవరి హస్తం ఉందో, ఎవరికి ఎంత ముడుపులు ముట్టాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం కేబినెట్ అప్రూవల్ (మంత్రిమండలి ఆమోదం) పొందిన తర్వాతే జరగాల్సిన ఇటువంటి కీలకమైన భూకేటాయింపులు, ఎవరి ప్రమేయంతో, ఎవరి ఒత్తిళ్లతో చట్టవిరుద్ధంగా జరిగిపోయాయో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు.

అక్రమాన్ని బయటకు తీయాల్సిందే..!

ఈ ఫుడ్ పార్క్ ఉదంతంలో జరిగిన ప్రతి ఒక్క అక్రమాన్ని బయటకు తీయాల్సిందేనని, ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే దీనిపై పూర్తి వివరాలతో కూడిన శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని పొంగులేటి సుధాకర్ రెడ్డి గట్టిగా డిమాండ్ చేశారు. ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులు, పాత్రధారుల ముసుగులు తొలగించి, వారిని సమాజం ముందు నిలబెట్టే వరకు బీజేపీ విశ్రమించబోదని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ద్వారా సమగ్ర దర్యాప్తు చేయిస్తామని, అవసరమైతే కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చేత కూడా దర్యాప్తు జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని స్పష్టం చేశారు. తాను ఈ జిల్లా వాసిగా ఇక్కడి రైతులకు జరిగిన అన్యాయాన్ని, దోపిడీని చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని, బాధితులకు న్యాయం జరిగే వరకు క్షేత్రస్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన పునరుద్ఘాటించారు. అంతకుముందు సత్తుపల్లి సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ హైవేపై మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావుతో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధి నంబూరి రామలింగేశ్వరరావు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రుద్ర ప్రదీప్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జొన్నలగడ్డ నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాయుడు రాఘవరావు,జిల్లా కార్యదర్శి వీరంరాజు, సత్తుపల్లి మండల, పట్టణ అధ్యక్షులు బానోతు విజయ్, శాలి శివకృష్ణ, వేంసూర్ మండల అధ్యక్షులు గొర్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు పరస రాంబాబు, రఘునాథరెడ్డి, భీమిరెడ్డి బాలకృష్ణారెడ్డి, బండి వెంకటరెడ్డి, నల్లమోతు నాని బాబు, కొప్పుల మధుసూదన్ రెడ్డి , వేముల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.