epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు

కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు
బీఆర్ఎస్ వ్యూహాత్మక దూకుడు!
చేర్యాల, మద్దూర్, కొమురవెల్లి, దూల్మిట్ట మండలాల్లో కాంగ్రెస్ వర్గపోరు
నేతల విభేదాలతో పార్టీ కార్యకలాపాల్లో డైలామా
క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం
సర్పంచ్ ఫోరం ఎన్నికల్లో గులాబీ పార్టీ హవా
కలిసికట్టుగా పనిచేస్తేనే గట్టెక్కేది.. కాంగ్రెస్‌ కార్యకర్తల ఆవేదన

కాక‌తీయ‌, చేర్యాల : జనగామ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. అధికార పార్టీలో ఉన్న ఈ ఆధిపత్య పోరు, పార్టీ శ్రేణుల్లో అయోమయాన్ని సృష్టిస్తోంది. నియోజకవర్గ స్థాయి నేతల మధ్య నెలకొన్న విభేదాలు, కార్యకర్తల మధ్య దూరాన్ని పెంచుతుండగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యలను ఆసరాగా చేసుకుని క్షేత్రస్థాయిలో పుంజుకుంటున్న వైనం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గం, నియోజకవర్గ ఇంచార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వర్గంగా నాయకత్వం విడిపోవడం పార్టీ బలోపేతానికి అడ్డంకిగా మారింది. ఒక వర్గం నిర్వహించే కార్యక్రమాలకు మరో వర్గం దూరంగా ఉండటం, పరోక్ష విమర్శలు చేసుకోవడం వల్ల సామాన్య కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న స్థానిక ఎన్నికల సమయానికి కూడా ఈ విభేదాలు కొనసాగితే, పార్టీ ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అధిష్టానం జోక్యం చేసుకుని, నేతలందరినీ ఒకే వేదికపైకి తీసుకురావాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.

చురుగ్గా గులాబీ పార్టీ.. రాజకీయ వేడి!
మరోవైపు, జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ ప్రజా సమస్యల అజెండాతో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. రైతుల కష్టాలు, తాగునీటి ఎద్దడి, అభివృద్ధి పనుల జాప్యం వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో పోరాటాలు చేస్తూ, ప్రజల్లోకి వెళ్తోంది. గతంలో జరిగిన సర్పంచ్ ఫోరం ఎన్నికల్లో చేర్యాల, కొమురవెల్లి, మద్దూర్, దూల్మిట్ట మండలాలను కైవసం చేసుకోవడం ద్వారా తమ బలాన్ని నిరూపించుకుంది. అధికారంలో లేకపోయినా గ్రామస్థాయిలో ఉన్న బలమైన క్యాడర్‌ను వాడుకుంటూ, అధికార పార్టీకి గట్టి రాజకీయ సవాల్ విసురుతోంది.

మారాలి.. లేదంటే ఇబ్బందే!
“ప్రజల కోసం పోరాడాల్సిన సమయంలో, వర్గపోరుతో సమయం వృధా చేసుకోవడం ఎంతవరకు సమంజసం?” అని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా మారుతుండగా, అధికార కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ అంతర్గత కుమ్ములాటలతో కాలక్షేపం చేయడం సరికాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆధిపత్య పోరుకు ముగింపు పలికి, నేతలందరూ సమన్వయంతో ప్రజల్లోకి వెళ్తేనే కాంగ్రెస్ పార్టీ మళ్లీ ప్రజల్లో బలంగా నిలబడగలదు. పార్టీ అధిష్టానం ఈ వర్గ విభేదాలపై ఎటువంటి చర్యలు తీసుకుంటుందో, నాయకులను ఏ విధంగా దారిలోకి తెస్తుందో వేచి చూడాలి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె...

రైతులకు సరిపడా యూరియా అందించాలి

రైతులకు సరిపడా యూరియా అందించాలి ఎరువుల విక్రయాల్లో అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ ఎమ్మార్పీ ధరలకే...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి * పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏబీవీపీ...

జీవో 97 రద్దు చేయాలి

జీవో 97 రద్దు చేయాలి పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా, ర్యాలీ కాకతీయ, చేర్యాల: పాలిటెక్నిక్‌...

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి..

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి.. *ప్రజా సమస్యలపై 11 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు కాకతీయ,చేర్యాల:...

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ బయోమెట్రిక్‌ హాజరుపై ఆరా.. సిబ్బంది...

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఆరోగ్యం మెరుగయ్యే వరకు మెరుగైన వైద్యం...

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.