చేర్యాలలో హర్ ఘర్ తిరంగా అభియాన్ ర్యాలీ
ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి : బీజేపీ రాష్ట్రనేత బల్ల శ్రీనివాస్
కాకతీయ, చేర్యాల : ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశ ఐక్యతను ప్రపంచానికి చాటాలని బీజేపీ రాష్ట్రనేత బల్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా అభియాన్‌లో భాగంగా బీజేపీ మండల అధ్యక్షుడు వడ్లకొండ సంజీవులు గౌడ్ ఆధ్వర్యంలో చేర్యాలలో బుధవారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న బల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ త్రివర్ణ పతాకాన్ని గర్వంగా చేతబట్టి ముందుకు సాగుతున్న ప్రతి క్షణం స్వాతంత్ర్య సమరయోధులు, వీర జవాన్ల త్యాగాలను స్మరించుకోవాలన్నారు. వారి ధైర్యం, అంకితభావం, దేశసేవ ఫలితంగానే భారత్ ప్రపంచ దేశాల ముందు గర్వించే స్థాయికి ఎదిగిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ నూతన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ వికసిత్ భారత్ లక్ష్యంగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. త్రివర్ణ పతాకాన్ని గౌరవంగా చేతబట్టడమే కాకుండా, దాని స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ నిత్యం హృదయాల్లో నిలుపుకోవాలని సూచించారు. ర్యాలీలో వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నర్రా మహేందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి కాశెట్టి పాండు, మండల ప్రధాన కార్యదర్శులు తౌట బాలరాజు, మన్నె సత్యవర్ధన్, ముచ్చంతల సిద్ధారెడ్డి, మండల ఉపాధ్యక్షుడు బయ్యారపు యాదగిరి, పట్టణ ప్రధాన కార్యదర్శి మనీశ్, కొట్టే చంద్రమౌళి, బీజేవైఎం నాయకులు మనోజ్‌కుమార్, ప్రవీణ్, సాయి తదితరులు పాల్గొన్నారు.


