ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి..
*ప్రజా సమస్యలపై 11 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు
కాకతీయ,చేర్యాల: ముస్త్యాల రైతు వేదికలో సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి మొత్తం 11 ఫిర్యాదులు స్వీకరించారు.ఇందులో ఇరిగేషన్ ఏఈకి సంబంధించిన సమస్యలపై 4 ఫిర్యాదులు, భూ సమస్యలపై 3, రైతు భరోసా కోసం 1, ఇందిరమ్మ ఇల్లు కోసం 1, ఉపాధి హామీ పథకం అమౌంట్ కోసం 1, తాడూరు జిల్లా పరిషత్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్) పోస్టు కోసం 1 ఫిర్యాదు అందింది.ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి, సమస్యలను పరిశీలించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

