epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం
ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె అశోక్‌
ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల వాల్‌ పోస్టర్ల ఆవిష్కరణ
నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌
కనీస వేతనాలు, సామాజిక భద్రత కల్పించాలని విజ్ఞప్తి

కాకతీయ, చేర్యాల : కార్మికుల హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటాలు నిర్వహించేది ఏఐటీయూసీ మాత్రమేనని ఏఐటీయూసీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు అందె అశోక్‌ అన్నారు. గురువారం చేర్యాల మండల కేంద్రంలోని కార్యాలయంలో కార్మిక సంఘం నాయకులతో కలిసి ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల వాల్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అశోక్‌ మాట్లాడుతూ.. 1920లో ఆవిర్భవించిన ఏఐటీయూసీ 105 సంవత్సరాలుగా కార్మికుల హక్కుల సాధన కోసం అనేక పోరాటాలు నిర్వహిస్తూ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్మికుడిపై ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడంతోపాటు సామాజిక భద్రత కల్పించాలని ప్రభుత్వాలను కోరారు. అసంఘటిత రంగ కార్మికులు, ఆటో డ్రైవర్లు, హమాలీలు, నిర్మాణ కార్మికులు సహా అన్ని వర్గాల శ్రామికులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్‌ 6, 7, 8 తేదీల్లో కరీంనగర్‌లో నిర్వహించనున్న ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహాసభలకు కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కర్రె ఆంజనేయులు, పాల సాయిరెడ్డి, ఈరి భూమయ్య, నంగి కనకయ్య, పొన్నబోయిన మమత, పోషబోయిన పరమశేఖర్‌, బియ్య బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రైతులకు సరిపడా యూరియా అందించాలి

రైతులకు సరిపడా యూరియా అందించాలి ఎరువుల విక్రయాల్లో అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ ఎమ్మార్పీ ధరలకే...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి * పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏబీవీపీ...

జీవో 97 రద్దు చేయాలి

జీవో 97 రద్దు చేయాలి పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా, ర్యాలీ కాకతీయ, చేర్యాల: పాలిటెక్నిక్‌...

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి..

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి.. *ప్రజా సమస్యలపై 11 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు కాకతీయ,చేర్యాల:...

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ బయోమెట్రిక్‌ హాజరుపై ఆరా.. సిబ్బంది...

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఆరోగ్యం మెరుగయ్యే వరకు మెరుగైన వైద్యం...

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి...

చుంచనకోటలో ఇక 24 గంటల నిఘా

చుంచనకోటలో ఇక 24 గంటల నిఘా సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.