కొడుకులు పట్టించుకోవడం లేదు
పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించిన వృద్ధ దంపతులు
కాకతీయ, దుగ్గొండి: మండలానికి చెందిన ఓ వృద్ధ దంపతులు తమ ముగ్గురు కొడుకులు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న దుగ్గొండి పోలీసులు వెంటనే స్పందించి వృద్ధ దంపతులకు అండగా నిలిచారు. పోలీసులు ముగ్గురు కుమారులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి, తల్లిదండ్రుల పట్ల తమ బాధ్యతలను గుర్తు చేశారు. అనంతరం తక్షణ సాయంగా ముగ్గురు కుమారుల నుంచి ఒక్కొక్కరు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.30 వేల రూపాయలను వృద్ధ దంపతులకు అందజేయించారు. అంతేకాకుండా, వృద్ధ దంపతుల నివాసం కోసం చేసే దిశగా కూడా చర్యలు చేపట్టారు. సోమవారం పోలీసుల సమక్షంలో కుమారులు తల్లిదండ్రులకు నగదు అందజేయగా, వృద్ధ దంపతులు పోలీసుల సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సై రావుల రణధీర్ మరియు పోలీస్ సిబ్బంది మానవతా దృక్పథాన్ని స్థానికులు అభినందించారు.

