చేర్యాలలో నాణ్యతలేని సీసీ రోడ్ల పనులు
కాంట్రాక్టర్ పై అధికారులపై చర్యలు తీసుకోవాలి : సీపీఎం
కాకతీయ,చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ప్రభుత్వ నిధులతో చేపడుతున్న సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని సీపీఎం పట్టణ కార్యదర్శి రాళ్లబండి నాగరాజు ఆరోపించారు. ఇసుకకు బదులుగా డస్ట్ వినియోగిస్తూ నాసిరకం పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌పై, వాటిని పర్యవేక్షించకుండా బిల్లులు మంజూరు చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్వాలిటీ కంట్రోల్ అధికారులతో విచారణ జరిపి నివేదిక అనంతరం మాత్రమే బిల్లులు చెల్లించాలని, లేకుంటే మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు.ఈ పరిశీలనలో సిపిఎం నాయకులు పోలోజు శ్రీహరి, ఆముదాల నర్సిరెడ్డి, ముస్ట్యాల ప్రభాకర్, ఇప్పకాయల శోభ,బోయిని మల్లేశం,ఎర్ర బోసు అశోక్, ఎండి నూర్ బి,తుమ్మలపల్లి అనిల్, దొనకాల కనకలక్ష్మి, బుట్టి మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు

