epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అక్ర‌మాల‌కు ప్లానింగ్‌

అక్ర‌మాల‌కు ప్లానింగ్‌
ఖమ్మం టౌన్ ప్లానింగ్‌లో.. అడ్డగోలు దందా!
అనుమతుల్లో అధికారుల ద్వంద్వ వైఖరి
ఏసీపీ స్థాయి నుంచి టీపీబీఓ వరకు.. అంతులేని నిర్లక్ష్యం
నిబంధనలు గాలికొదిలి.. నచ్చిన వారికి భారీ భవనాలకు అనుమతులు
సాకులతో దరఖాస్తుదారులకు చుక్కలు చూపిస్తున్న వైనం
‘సుడా’లో తండ్రి.. ‘నగరా’లో కొడుకు.. తెర వెనుక వింత కథ
కమిషనర్ మౌనం.. సామాన్యుడికి శాపం

కాక‌తీయ‌, ఖ‌మ్మం బ్యూరో : ఖమ్మం నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. భవన నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసుకున్న ప్రజలను అధికారులు ఆఫీసు చుట్టూ తిప్పుకుంటూ, వేధిస్తున్న తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. కింది స్థాయి సిబ్బంది నుంచి మొదలుకుని ఏసీపీ స్థాయి అధికారి వరకు అంతా ఒకే ‘తాటి’పై నడుస్తూ, దరఖాస్తుదారుల గోడును ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల పనితీరులో ద్వంద్వ వైఖరి బట్టబయలైంది. ఖానాపురం హవేలీ పరిధిలో రసపాక హోటల్ ఎదురుగా, కేవలం 25 అడుగుల రోడ్డు ఉన్న చోట ఐదు అంతస్తుల భారీ భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన టౌన్ ప్లానింగ్ అధికారులు, అదే నిబంధనలతో ఉన్న ఇతర దరఖాస్తులను మాత్రం పక్కనబెడుతున్నారు. నిబంధనలను తమకు నచ్చినట్లుగా వాడుకుంటూ, అక్రమ నిర్మాణాలకు కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఇదే రోడ్డులో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఓ లాడ్జ్ విషయంలోనూ ఇదే తతంగం నడిచిందని స్థానికులు గుర్తు చేస్తున్నారు.

సాకులతో చుక్కలు..

ఖానాపురం హావేలి కల్లూరి నగర్‌లో ఇల్లు నిర్మించుకోవడానికి దరఖాస్తు చేసుకున్న ఓ బాధితుని పరిస్థితి దయనీయం. సదరు యజమాని స్థలానికి ఇరువైపులా ఉన్న ఇళ్లకు రెండు నెలల క్రితమే అనుమతులు ఇచ్చిన అధికారులు, అదే స్థలానికి వచ్చేసరికి ‘ఇరిగేషన్ శాఖ ఎన్‌ఓసీ కావాలి’ అంటూ షార్ట్‌ఫాల్ కొట్టడం గమనార్హం. పక్కన ఇళ్లకు అనుమతి ఇచ్చినప్పుడు లేని అభ్యంతరం, ఇప్పుడు ఎలా వచ్చిందని బాధితుడు ప్రశ్నిస్తున్నా, అధికారులు స్పష్టమైన సమాధానం చెప్పకుండా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తున్నారు.

తండ్రి సుడాలో.. కొడుకు టౌన్ ప్లానింగ్‌లో..

ఈ వ్యవహారంలో ఒక ఆసక్తికరమైన అంశం తెరపైకి వచ్చింది. టౌన్ ప్లానింగ్ విభాగంలో అపార అనుభవం ఉన్న తండ్రి ‘సుడా’లో పనిచేస్తుండగా, ఆయన కుమారుడు నగర పాలక సంస్థలో టీపీబీఓ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ తండ్రీకొడుకుల జోడీ కనుసన్నల్లోనే అనుమతులు నడుస్తున్నాయని, చిన్న చిన్న పొరపాట్లను కూడా భూతద్దంలో పెట్టి చూస్తూ దరఖాస్తుదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.

కమిషనర్ మౌనం.. అంతే సంగతులు!

ఒకప్పుడు సిబ్బంది కొరత వల్ల పనులు ముందుకు సాగడం లేదని సాకులు చెప్పిన అధికారులు, ఇప్పుడు సిబ్బంది పుష్కలంగా ఉన్నా సరే.. పనులు ముందుకు కదలడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. టౌన్ ప్లానింగ్‌లో ఇంత జరుగుతున్నా, నగర పాలక సంస్థ కమిషనర్ అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి, టౌన్ ప్లానింగ్‌లో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే విభాగం పరిస్థితి మరింత దిగజారుతుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.