epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సొసైటీ పేరుతో మాయ

సొసైటీ పేరుతో మాయ
రిజిస్ట్రేష‌న్ లేకుండానే అగ్రిమెట్లు
అభివృద్ధి పేరుతో.. చర్చి ఆస్తి విక్రయం?
పన్నుల ఎగవేత.. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి
బహుళ అంతస్తుల నిర్మాణంలోనూ అక్రమాలు
ఆన్‌లైన్‌లో మాయమైన సొసైటీ వివరాలు
స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్న అధికారులు

కాక‌తీయ‌, మ‌యూరి సెంట‌ర్‌ : ఖమ్మం నగరంలోని వైరా రోడ్డులో వెలిసిన ఒక బహుళ అంతస్తుల భవనం ఇప్పుడు వివాదాలకు నిలయంగా మారింది. ‘ఆంధ్ర సోషల్ వెల్ఫేర్ సొసైటీ’ పేరును అడ్డం పెట్టుకుని సదరు సంస్థ భారీగా ఆస్తి పన్నును ఎగవేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం, ఆన్‌లైన్ పోర్టల్‌లో అస్పష్టమైన రికార్డుల కారణంగా ప్రభుత్వ ఖజానాకు లక్షల రూపాయల ఆదాయం గండిపడుతోంది. నగరంలోని ఖానాపురం హవేలీ రెవెన్యూ పరిధి, సర్వే నంబర్ 257లో 2020లో ‘టీఎస్-బీపాస్’ అనుమతులతో ఈ బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించినట్లు చెబుతున్నారు. అయితే అక్కడ ఎన్నో ఏళ్ల క్రితం ఉన్న చిన్న షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి కేటాయించిన మూడు ఇంటి నంబర్లనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. కొత్తగా నిర్మించిన భారీ భవనానికి కూడా పాత కాంప్లెక్స్ పన్నునే చెల్లిస్తూ, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ తతంగం వల్ల ప్రభుత్వానికి ఏటా లక్షల రూపాయల ఆదాయం నష్టపోవాల్సి వస్తోందని ఆరోపణలు ఉన్నాయి.

సొసైటీ బైలా.. ఆన్‌లైన్‌లో ఏదీ?

1968లో స్థాపించబడిన ఈ సొసైటీకి సంబంధించిన కీలకమైన వివరాలు రిజిస్ట్రేషన్ శాఖ ఆన్‌లైన్ పోర్టల్‌లో ఎక్కడా కనిపించడం లేదు. సంస్థ రెన్యువల్ కోసం పదేపదే దరఖాస్తు చేసుకున్నామని చెబుతున్నా, అవేవీ ఆన్‌లైన్‌లో అందుబాటులో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం ఫాదర్ అంబటి జేవియర్ బాబు అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఈ సంస్థలో మరో ఆరుగురు సభ్యులుగా ఉన్నట్లు తెలుస్తోంది. కీలకమైన మినిట్స్, బైలా వివరాలు ఆఫ్‌లైన్‌లో కూడా దొరక్కపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

అభివృద్ధి పేరుతో.. చర్చి ఆస్తి విక్రయం?

నిర్మాణంలో కొంత భాగాన్ని అభివృద్ధి పేరుతో 2012లో ఒక ప్రైవేట్ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి మూడున్నర కోట్ల రూపాయలకు విక్రయించినట్లు తెలుస్తోంది. సొసైటీ పేరు మీద ఉన్న చర్చి ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడంలో ఒక కాంట్రాక్టర్ అల్లుడు చక్రం తిప్పారని, ఆ సమయంలో ఆయన ఆఫ్రికాలో ఉండి అంతా నడిపించారని బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు నేపాల్‌లో ఉంటున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. సొసైటీ వ్యవహారాల్లో పారదర్శకత లోపించడం, చర్చి ఆస్తి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతున్నారు.

అధికారులు స్పందించేనా?

ఈ బహుళ అంతస్తుల భవనంపై, సొసైటీ లావాదేవీలపై మున్సిపల్, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పన్ను ఎగవేతపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, ప్రభుత్వానికి రావాల్సిన పన్నులను వసూలు చేయడంతో పాటు, సొసైటీ రికార్డులను బహిర్గతం చేయాలని నగరవాసులు కోరుతున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటేనే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.