epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మాదకద్రవ్యాల కట్టడే లక్ష్యం

మాదకద్రవ్యాల కట్టడే లక్ష్యం
బేసిక్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి
సాంకేతికతతో స్మార్ట్ పోలీసింగ్
అదుపులోకి వస్తున్న డ్రగ్స్ రవాణా
భూ వివాదాల్లో పోలీసుల‌ జోక్యం వద్దు
సైబర్ నేరాలపై నిరంతర నిఘా ఉండాలి
ఖ‌మ్మం పోలీసు యంత్రాంగానికి డీజీపీ దిశా నిర్దేశం

కాకతీయ, ఖమ్మం బ్యూరో : మాదకద్రవ్యాల నియంత్రణపై యుద్ధం ప్రకటించాలని, భావితరాలను కాపాడటమే ధ్యేయంగా ప్రతి పోలీస్ అధికారి పనిచేయాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. తెలంగాణ స్మార్ట్ పోలీసింగ్ లక్ష్యంగా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, అదే సమయంలో ప్రాథమిక పోలీసింగ్‌కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం స్థానిక ఎస్బీ కాన్ఫరెన్స్ హాల్‌లో శాంతిభద్రతలు, నేర నియంత్రణపై డీజీపీ సమీక్ష నిర్వహించారు. పోలీస్ యూనిఫాం ధరించడం అదృష్టంగా భావించి ప్రజల రక్షణే పరమావధిగా పనిచేయాలని, కోట్ల మంది జనాభాలో చాలా తక్కువ మందికి మాత్రమే ఈ అవకాశం దక్కుతుందని, ఆ గౌరవాన్ని కాపాడుకుంటూ ప్రజలకు అంకితం కావాలని సూచించారు.

ఆస్తి నేరాలను అరికట్టేందుకు గస్తీ
బేసిక్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని, రాత్రి గస్తీని మరింత బలోపేతం చేయడం ద్వారా ఆస్తి నేరాలను పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు. చట్టం అనేది సామాన్యులకు రక్షణ కవచంలా ఉండాలి తప్ప, చట్టాన్ని చేతిలోకి తీసుకునే రౌడీలు, గూండాల పట్ల కఠినమైన పోలీసింగ్ తప్పదని హెచ్చరించారు. సివిల్, భూ వివాదాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులు జోక్యం చేసుకోకూడదని, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌ను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ఇసుక, మట్టి మాఫియా, రౌడీషీటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

సాంకేతికతతో నేరాల కట్టడి
క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్, హాక్ ఐ, తెలంగాణ కాప్స్ వంటి సాంకేతిక వేదికలను సమర్థంగా వినియోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికత, కృత్రిమ మేధస్సు, సీసీ కెమెరాలు, డేటా అనలిటిక్స్, సాక్ వ్యవస్థలతో నేరాల నియంత్రణను మరింత పటిష్టం చేస్తున్నామని తెలిపారు. మావోయిస్టుల కంటే గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా ఇప్పుడు పెద్ద సవాలుగా మారిందని, వీటిని అరికట్టేందుకు ఈగల్ పోలీస్ బృందాలతో క్షేత్రస్థాయిలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, డ్రగ్స్ ముఠాలపై నిరంతర నిఘా ఉంచి పీడీ చట్టం వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రాధాన్యం
సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న దృష్ట్యా ప్రజల్లో అవగాహన పెంచాలని, నేరగాళ్లు అనుసరిస్తున్న కొత్త పద్ధతులను అడ్డుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకోవాలని చెప్పారు. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు వాహనదారులు వేగ పరిమితులు పాటించాలని, ముఖ్యంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వాడకం తప్పనిసరి అని, మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడకంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. రోడ్డు భద్రత కోసం ఈగల్ తరహాలో ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ బ్యూరోను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సమీక్షలో ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్, అదనపు డీసీపీలు రామానుజం, కుమారస్వామి, విజయబాబు, ఏసీపీలు వసుంధర యాదవ్, రమణమూర్తి, తిరుపతి రెడ్డి, సారంగపాణి, మహేష్, శ్రీనివాసులు, సర్వర్, సత్యనారాయణ, సుశీల్ సింగ్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.