epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్

  • వడ్డీ లేని రుణాల పరిమితి రూ.10 లక్షలకు పెంపు
  • మహిళా సంఘాలకు 1 లక్ష కోట్ల రుణాలు అందించడమే లక్ష్యం
  • రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయం
  • 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ
  • రైతు భరోసా నిధుల పంపిణీలో అద్భుత రికార్డు
  • వడ్డీ లేని రుణాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కీలక ప్రకటన

కాకతీయ, చింతకాని: మహిళలను ఆర్థికాభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని, అందులో భాగంగా డ్వాక్రా మహిళలకు ఇచ్చే వడ్డీ లేని రుణాల పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రకటించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో కలిసి మెగా రైతు మేళాను ప్రారంభించిన ఆయన, మహిళా సంఘాలకు తమ ప్రభుత్వం హయాంలో మొత్తం 1 లక్ష కోట్ల రుణాలు అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఇప్పటికే మహిళలకు 67 వేల కోట్లు వడ్డీ లేని రుణాలు అందించామని, గత ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఎగ్గొట్టిన వడ్డీ లేని రుణాలను కూడా తమ ప్రభుత్వం చెల్లిస్తోందని ఆయన వెల్లడించారు.

రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యం
రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సాగునీరు, ధాన్యం కొనుగోలు, వ్యవసాయ యాంత్రీకరణ, మార్క్‌ఫెడ్ కార్యకలాపాల బలోపేతానికి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని తెలిపారు. రైతుల ఆదాయం పెంచి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. రైతు భరోసా కింద కేవలం 9 రోజుల్లోనే 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. ధాన్యం, మొక్కజొన్న, జొన్నల కొనుగోలు ద్వారా రైతులను అన్ని విధాలా ఆదుకున్నామని, మాటలతో కాదు చేతలతో రైతు సంక్షేమాన్ని నిరూపిస్తున్నామని తెలిపారు.

పాత బకాయిల చెల్లింపు
గత ప్రభుత్వం రైతుబంధు కింద ఎకరాకు 5 వేలు మాత్రమే ఇచ్చేదని, ఆ డబ్బులు జమ చేసేందుకు 160 రోజులు పట్టేదని భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. దశాబ్దాల క్రితం కాంగ్రెస్ నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు నేటికీ రైతులకు నీరందిస్తున్నాయని, రైతుల సంక్షేమానికి శాశ్వత పరిష్కారాలే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రైతే దేశానికి వెన్నెముక అని, ఆ వెన్నెముకను మరింత బలోపేతం చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.