రైతు ఆశీర్వాద సభతో ఒరిగిందేమిటి?
ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలం
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వం
మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జ్ లింగాల కమల్ రాజ్
ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై కార్యకర్తలతో సమీక్ష
కాకతీయ, చింతకాని: రైతు ఆశీర్వాద సభల పేరుతో ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తోందని, అదే నిధులను రైతులు, దళిత బంధు లబ్ధిదారుల సంక్షేమానికి ఖర్చు చేసి ఉంటే బాగుండేదని మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జ్ లింగాల కమల్ రాజ్ విమర్శించారు. చింతకానిలో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలులో పూర్తిగా విఫలమైందని కమల్ రాజ్ ఆరోపించారు. కేసీఆర్ హయాంలో అందిన దళిత బంధు, రైతు భరోసా పథకాలను నిలిపివేసి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి హామీలను గాలికి వదిలేశారని విమర్శించారు. కేవలం ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన సమయంలో తీర్పు ఇస్తారని హెచ్చరించారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో బీఎల్‌ఏలను నియమించామని, ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఓటును క్షుణ్ణంగా పరిశీలించి తప్పులు లేకుండా చూడాలని కార్యకర్తలకు సూచించారు. సమావేశం అనంతరం అనారోగ్యంతో ఉన్న మాజీ ఎంపీపీ గురజాల హనుమంతరావును ఆయన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జ్ లింగాల కమల్ రాజ్, మంకేన రమేష్, వంకాయపాటి లచ్చయ్య, బొడ్డు వెంకటరామారావు, పొనుగోటి రత్నాకర్, గడ్డం శ్రీనివాసరావు, పిన్నెల్లి శీనివాస్, దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, పరిశుద్ధరావు, బండి రామారావు, తునికిపాటి పూర్ణయ్య, తిరుపతి కొండలు, సామినేని బాబురావు, జలగబోయన కృష్ణ, చెవుల వెంకటప్రసాద్, నన్నక నరసింహారావు, బండి కిషోర్, మరీదు లక్ష్మీనారాయణ, షేక్ మీరా సాబ్, తిరుపతి, చలమయ్య, ఆకుల చంద్రయ్య, చిట్టిమోదు రాంబాబు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

