epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

చెరువు మింగేస్తున్న కబ్జా రాయుళ్లు

చెరువు మింగేస్తున్న కబ్జా రాయుళ్లు
నిమ్మకు నీరెత్తినట్లుగా ఇరిగేషన్ శాఖ!
నివేదికలు ఇచ్చినా కదలని రెవెన్యూ యంత్రాంగం
“న‌న్నేం చేయ‌మంటారు..?” అంటూ బాధ్యతారాహిత్యంగా ఏఈ సమాధానం
రెండేళ్లుగా ఫైళ్లకే పరిమితమైన ఎర్రచెరువు ఆక్రమణల కేసు
సర్వేల పేరుతో అధికారుల కాలయాపన
కలెక్టర్ జోక్యం కోసం నరసింహరావుపేట గ్రామస్థుల ఎదురు చూపు

కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖ‌మ్మం జిల్లా తల్లాడ మండలం నరసింహరావుపేటలోని ఎర్రచెరువు అక్రమణల వ్యవహారం అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారింది. ప్రభుత్వ చెరువును కబ్జా చేస్తున్నారని ఇరిగేషన్ శాఖ స్వయంగా గుర్తించి నివేదిక సమర్పించి రెండేళ్లు గడిచినా, చర్యలు తీసుకోవడంలో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు పూర్తిగా విఫలమయ్యాయి. బాధ్యతను ఒకరిపై ఒకరు నెట్టుకుంటూ, అక్రమాలకు పరోక్షంగా సహకరిస్తున్న తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సమాచార హక్కు చట్టం ద్వారా బయటపడిన వివరాల ప్రకారం, అప్పటి ఇరిగేషన్ ఏఈ ఆయేషా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, చెరువు పరిధిలో ఆక్రమణలు జరిగినట్లు అధికారికంగా నిర్ధారించారు. ఆక్రమణలను వెంటనే తొలగించాల్సిందిగా తహసీల్దార్‌కు లేఖ రాశారు. అయితే, ఆ నివేదిక ప్రభుత్వ కార్యాలయాల ఫైళ్లలో దుమ్ము పడుతోంది తప్ప, ఆక్రమణల తొలగింపునకు అడుగు ముందుకు పడలేదు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన శాఖలే, కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నాయా? అనే అనుమానాలు బలపడుతున్నాయి.

“న‌న్నేం చేయ‌మంటారు..?” .. అధికారుల బాధ్యతారాహిత్యం!
ఈ సమస్యపై ప్రస్తుత ఇరిగేషన్ ఏఈని వివరణ కోరగా, ఆమె స్పందించిన తీరు విస్మయానికి గురిచేసింది. “రెండేళ్లుగా ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి.. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? రెవెన్యూ అధికారులదే బాధ్యత” అంటూ ఆమె బాధ్యతారహితంగా సమాధానమిచ్చినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అటు తహసీల్దార్ కరుణాకర్ రెడ్డిని సంప్రదించగా, “ఇరిగేషన్ అధికారులు స్పష్టమైన లేఖ ఇస్తే ఎంక్రోచ్‌మెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటాం.. మా సిబ్బందితో మళ్లీ సర్వే చేయిస్తాం” అని పాత పాటనే పాడారు. అధికారుల ఈ ఉదాసీనత కబ్జాదారులకు వరంగా మారింది.

చెరువు కనుమరుగు.. రైతుల ఆందోళన
ఎర్రచెరువు గ్రామానికి కీలక జలవనరు. ఆక్రమణల కారణంగా చెరువు విస్తీర్ణం రోజురోజుకూ తగ్గిపోతోంది. దీంతో వ్యవసాయంపై ఆధారపడిన రైతులు, జలవనరుల కోసం ఇబ్బందులు పడుతున్న గ్రామస్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, ఒకరిపై ఒకరు బాధ్యతను నెట్టుకోవడం వల్ల చెరువు ఉనికి ప్రమాదంలో పడింది.

కలెక్టర్ జోక్యం కోసం గ్రామస్థుల డిమాండ్
రెండేళ్లుగా జరుగుతున్న ఈ తతంగంపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ మరియు ఇరిగేషన్ అధికారుల బాధ్యతారాహిత్యాన్ని విచారించి, తక్షణమే ఎర్రచెరువును ఆక్రమణల నుంచి విముక్తి చేయాలని వారు కోరుతున్నారు. “నివేదికలు ఇచ్చిన తర్వాత కూడా చర్యలు తీసుకోకపోతే ఆ నివేదికల ప్రయోజనం ఏంటి?” అని గ్రామస్థులు నిలదీస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని, ఎర్రచెరువును కాపాడాలని స్థానికులు వేడుకుంటున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.