- విక్రమ్-1 విజయానికి కీలక సహకారం
- స్కైరూట్ ఏరోస్పేస్లో టీమ్ లీడర్‌గా మోర్తాల నరేందర్ రెడ్డి
- పదేళ్లకు పైగా అంతరిక్ష, రక్షణ రంగాల్లో విశేష అనుభవం
- ముదిగొండ మండలం మాధాపురం యువకుడిపై సర్వత్రా హర్షం
కాకతీయ, ముదిగొండ : భారత అంతరిక్ష రంగంలో ఖమ్మం జిల్లాకు చెందిన యువకుడు తన ప్రతిభతో గర్వకారణంగా నిలిచారు. ముదిగొండ మండలం మాధాపురం గ్రామానికి చెందిన రైతు కుటుంబంలో జన్మించిన మోర్తాల నరేందర్ రెడ్డి, ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్లో టీమ్ లీడ్ – ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తల్లిదండ్రులు హనుమి రెడ్డి, లక్ష్మి మరియు సతీమణి శ్రీ వెంకట దివ్య ప్రోత్సాహంతో ఆయన ఈ స్థాయికి చేరుకున్నారు.
విక్రమ్-1 ప్రయోగంలో కీలక సహకారం
ఇటీవల అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగంలో నరేందర్ రెడ్డి కీలక బృంద సభ్యుడిగా వ్యవహరించి మిషన్ విజయానికి తన వంతు సహకారం అందించారు. గత పదేళ్లకు పైగా అంతరిక్ష మరియు రక్షణ రంగాల్లో విశేష అనుభవం సంపాదించిన ఆయనకు, లాంచ్ వెహికల్ ఇంటిగ్రేషన్, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్, టెస్టింగ్, లాంచ్ ఆపరేషన్స్ వంటి సాంకేతిక విభాగాల్లో పట్టు ఉంది. భారత అంతరిక్ష రంగ అభివృద్ధిలో దేశానికి సేవ చేయడం ఎంతో గర్వకారణంగా ఉందని ఆయన తెలిపారు. జిల్లా యువకుడు జాతీయ స్థాయిలో ఇలాంటి కీలక బాధ్యతలు నిర్వర్తించడం పట్ల స్థానికులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

