epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మై భారత్ పోర్టల్‌లో ప్రతి విద్యార్థిని నమోదు చేయాలి

  • జిల్లా యూత్ పార్లమెంట్ నిర్వహించాలి
  • యువతను విస్తృతంగా భాగస్వాములను చేయాలి
  • ప్ర‌తిభావంతుల‌ను గుర్తించి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయాలి
  • ప్రతి నెల కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు నిర్వహించాలి
  • స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ

కాకతీయ, మయూరి సెంటర్ : కేంద్ర ప్రభుత్వం యువత కోసం ప్రారంభించిన మై భారత్ పోర్టల్ ద్వారా అందుబాటులో ఉన్న అవకాశాలను ప్రతి విద్యార్థికి చేరేలా చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా యువజన కార్యక్రమాల సలహా సంఘం సమావేశంలో ఆమె అధికారులతో సమీక్షించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మై భారత్ పోర్టల్ ద్వారా యువతకు వివిధ రంగాల్లో మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు 14 వేల మంది యువత మాత్రమే ఈ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారని, ప్రత్యేక నమోదు కార్యక్రమం ద్వారా ఈ సంఖ్యను భారీగా పెంచాలని సూచించారు. జిల్లాలోని ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, నర్సింగ్ కళాశాలలతో పాటు అన్ని విద్యాసంస్థలను సందర్శించి ప్రతి విద్యార్థిని మై భారత్ పోర్టల్‌లో నమోదు చేయించాలని ఆదేశించారు. అలాగే ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులను కూడా తప్పనిసరిగా నమోదు చేయాలని స్పష్టం చేశారు.

ప్రత్యేక పోటీలు – అవకాశాలు
జిల్లా స్థాయిలో యూత్ పార్లమెంట్ నిర్వహించి విజేతలను రాష్ట్ర స్థాయికి పంపాలని, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన యువతకు భారత పార్లమెంట్‌లో పాల్గొనే సువర్ణ అవకాశం లభిస్తుందని తెలిపారు. వికసిత్ భారత్ కార్యక్రమంలో నిర్వహించే క్విజ్ పోటీల్లో విజేతలకు దేశ సరిహద్దు రాష్ట్రాల పర్యటన అవకాశం లభిస్తుందని, కొన్ని కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన వారికి గౌరవనీయులైన ప్రధాన మంత్రిని కలిసే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాలపై యువతలో విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నషా ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా వ్యాసరచన, చిత్రలేఖనం తదితర ఎనిమిది రకాల పోటీలను జిల్లాలో నిర్వహించాలని సూచించారు. జిల్లా స్థాయిలో విజేతలకు కేంద్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

నెలవారీ కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు
యువతకు భవిష్యత్ కెరీర్‌పై స్పష్టమైన అవగాహన కల్పించేందుకు ప్రతి నెల చివరి ఆదివారాల్లో కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ అనంతరం ఉన్నత విద్య, వివిధ ప్రవేశ పరీక్షలు, ఉద్యోగ అవకాశాలు, రక్షణ రంగం మరియు ఇతర వృత్తి రంగాలపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించాలన్నారు. కెరీర్ గైడెన్స్ కార్యక్రమాల సమర్థ నిర్వహణ కోసం సంబంధిత శాఖలతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, అవసరమైన అధ్యయన సామగ్రి, పరీక్షల విధానం, కెరీర్ మార్గదర్శక సమాచారాన్ని సిద్ధం చేసి విద్యార్థులకు నిరంతరం అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ వెంకట్రామ్ బాబు, జిల్లా ఉపాధి అధికారి ఎన్. మాధవి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జి. జ్యోతి, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎ. రవిప్రసాద్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె. రవిబాబు, జిల్లా విద్యాధికారి, జిల్లా యువజన క్రీడల అధికారి టి. సునీల్ రెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, ఎన్ఎస్ఎస్ జిల్లా ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్ రావు, అడిషనల్ డీఎంహెచ్‌ఓ, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.