ప్రజాసేవలో కేటీఆర్ ప్రస్థానం ఆదర్శప్రాయం
ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఖ్యాతిని చాటిన నాయకుడు
ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఇంచార్జి అనిల్ బైరెడ్డి
కేటీఆర్ 50 ఏళ్ల జీవిత ప్రయాణంపై శుభాకాంక్షలు
కాకతీయ, వరంగల్ బ్యూరో : 50 ఏళ్ల జీవిత ప్రయాణం, 20 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఎన్నారైలకు ఆదర్శంగా నిలిచారని ఎన్నారై బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఇంచార్జి అనిల్ బైరెడ్డి పేర్కొన్నారు. కేటీఆర్ 50వ జన్మదినం సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజకీయ కుటుంబంలో జన్మించినప్పటికీ తన కృషి, పరిపాలనా సామర్థ్యం, ప్రజలతో మమేకమయ్యే తీరుతో ప్రత్యేక గుర్తింపు సాధించారని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడంతో పాటు రాష్ట్ర ఏర్పాటుకు తర్వాత పరిశ్రమలు, ఐటీ, పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉపాధి అవకాశాల సృష్టిలో విశేష కృషి చేశారని తెలిపారు.
ప్రవాసులను రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములను చేశారు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రవాసులను రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములను చేయడంలో కేటీఆర్ కీలక పాత్ర పోషించారని, వారి ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రంతో అనుబంధాన్ని మరింత బలోపేతం చేశారని అనిల్ బైరెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా సామాజిక మాధ్యమాల ద్వారా సమస్యలకు స్పందించడం, యువతను ప్రోత్సహించడం కేటీఆర్ నాయకత్వ ప్రత్యేకత అని తెలిపారు. మరిన్ని సంవత్సరాలు ప్రజాసేవలో కొనసాగుతూ తెలంగాణ అభివృద్ధికి తన అనుభవం, దూరదృష్టిని అందించాలని ఆకాంక్షిస్తూ కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

