ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం
ఆత్మకూరులో నూతన తహసీల్దార్ కార్యాలయానికి స్థల పరిశీలన
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
కాకతీయ, ఆత్మకూరు : ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అన్ని మౌలిక సదుపాయాలతో నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని నిర్మిస్తామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి తెలిపారు. శనివారం ఆత్మకూరు మండల కేంద్రంలో పునర్నిర్మాణం చేపట్టనున్న తహసీల్దార్ కార్యాలయ స్థలాన్ని అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవన నిర్మాణానికి రూ.2.25 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ప్రజలకు సౌకర్యవంతంగా సేవలు అందేలా ఆధునిక వసతులతో కార్యాలయాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు.
త్వరలో నిర్మాణ పనులు
నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు రేవూరి జెలందర్ రెడ్డి, సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు, హౌస్బుజుర్గ్ సర్పంచ్ మౌలా, కాంగ్రెస్ నాయకులు కమలాపురం రమేష్, కంచె రవికుమార్, రేవూరి జైపాల్ రెడ్డి, రేవూరి రణధీర్ రెడ్డి, పరికిరాల వాసు, అలవాల రవి, మండల యూత్ అధ్యక్షుడు సందీప్, గుండెబోయిన శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

