epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సింగరేణి చుట్టూ బీజేపీ రాజకీయ వ్యూహం

సింగరేణి చుట్టూ బీజేపీ రాజకీయ వ్యూహం
మూడో కోల్ బ్లాక్‌తో కేంద్రం ముద్ర వేయాలనే ప్రయత్నం
రూ.54 వేల కోట్ల బకాయిలపై రేవంత్ సర్కార్‌ను నిలదీసిన కిషన్ రెడ్డి
మెటా నోటీసులు, డీసీపీ బదిలీపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు

కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో రాజకీయంగా బలం పెంచుకోవడానికి బీజేపీ కొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది. ఒకవైపు కేంద్రం మంజూరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే, మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రక్షణాత్మక స్థితిలోకి నెట్టే అంశాలను ముందుకు తెస్తోంది. తాజాగా సింగరేణికి వరుసగా మూడో కోల్ బ్లాక్ దక్కడాన్ని కేంద్ర ప్రభుత్వ విజయంగా ప్రచారం చేస్తూనే, సింగరేణి బకాయిల అంశాన్ని ప్రధాన రాజకీయ అస్త్రంగా మార్చే ప్రయత్నం కనిపిస్తోంది. కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడిన తీరు కూడా ఇదే వ్యూహానికి అద్దం పట్టింది. మణుగూరు పీకేఓసీ-2 డిప్ సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కడం కేంద్ర ప్రభుత్వ చొరవ వల్లే సాధ్యమైందని పేర్కొన్న ఆయన, సింగరేణి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వేలం ప్రక్రియలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని వివరించారు.

సింగరేణినే రాజకీయ అస్త్రంగా…

సింగరేణి కార్మికులకు సంబంధించిన రూ.54 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాల వల్లే సంస్థ ఆర్థికంగా దెబ్బతిన్నదని ఆరోపిస్తూ, బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండింటినీ ఒకే తీరులో విమర్శించారు. బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు తాము బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. సింగరేణి అంశంపై కార్మికులు, ఉద్యోగులు, ఉత్తర తెలంగాణ ప్రజలను తమవైపు తిప్పుకోవాలనే రాజకీయ లక్ష్యంతో బీజేపీ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సామాజిక మాధ్యమాల్లో వచ్చిన అభ్యంతరకర పోస్టుల వ్యవహారాన్ని కూడా బీజేపీ రాజకీయంగా ముందుకు తెచ్చింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి మెటా ఇండియాకు నోటీసులు జారీ చేసిన అధికారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. డీసీపీ అరవింద్ బాబు బదిలీని ప్రస్తావిస్తూ, అధికారులను రాజకీయ ఒత్తిడితో బదిలీలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిపాటిగా మారిందన్నారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ పాలనపైనా విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో సైబర్ నేరాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో చట్టప్రకారం చర్యలు తీసుకోవడంలో తప్పేముందని ప్రశ్నించిన ఆయన, ఏ సోషల్ మీడియా సంస్థ అయినా భారత చట్టాలకు లోబడాల్సిందేనని స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం

నీటి కష్టాలకు కేసీఆర్‌ వైఫల్యాలే కార‌ణం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా...

ఇనుగాల‌కు అవ‌మానం

ఇనుగాల‌కు అవ‌మానం కుడా మాజీ చైర్మ‌న్‌కు నో ఫేర్‌వెల్ ఆఘ మేఘాల మీద నూత‌న...

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..?

కాంగ్రెస్‌కు కొండా గుడ్‌బై..? బీఆర్ఎస్‌తో దంప‌తుల‌ మంతనాలు! కేటీఆర్‌ నేరుగా కొండా సురేఖకు ఫోన్‌ గత...

ఇదేం అన్యాయం..!?

ఇదేం అన్యాయం..!? కుడా చైర్‌ప‌ర్స‌న్‌గా సుధారాణి నియామ‌కంపై కాంగ్రెస్‌లో అసంతృప్తి పార్టీ అధికారంలోకి వ‌చ్చాక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.