

కాకతీయ, మయూరి సెంటర్: అర్బన్ ఎమ్మార్వో ప్రభుత్వ కార్యాలయ ఆవరణములో కొంతమంది వ్యక్తులు మద్యం సేవిస్తున్న దృశ్యాలు ” కాకతీయ నిఘ కెమెరాకు” చిక్కాయి. ఆఫీస్ పని వేళలోనే ఓ ఆకతాయి మద్యం తాగుతూ ఆవరణంలో కనిపించడంతో వివిధ పనుల మీద ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలా మందుబాబులు కార్యాలయ ఆవరణంలోనే, బహిరంగంగా మందు తాగి చిందులేయడంతో కార్యాలపు సిబ్బంది ఏం చేస్తున్నారని?? స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పని కోసం వచ్చే మహిళలు, వృద్ధులు ఇలాంటి వాతావరణంతో ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవలు అందించే పవిత్ర ప్రదేశాలు. అలాంటి చోట మద్యం సేవించడం ఉల్లంఘనే కింది అవుతుందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఖమ్మం అర్బన్ ఎమ్మార్వో కార్యాల ఆవరణంలో పటిష్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి అని స్థానికులు కోరుతున్నారు. ఆఫీస్ పనివేళల తర్వాత కూడా సెక్యూరిటీ ఉండాలి అని, సీసీ కెమెరాల ఏర్పాటు, 24 గంటల పర్యవేక్షణ ఉండాలి అని ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి వారిపై పోలీస్ కేసు నమోదు చేయాలి పలువురు కోరుతున్నారు.

