epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మోదీ విధానాలను ప్రతిఘటించాలి

మోదీ విధానాలను ప్రతిఘటించాలి
యువత హక్కుల కోసం పోరాటాలు కొనసాగిస్తాం
నిరుద్యోగం, విద్య, సామాజిక న్యాయంపై ఉద్యమాలు
ప్రశ్నించడం, నిరసించడం యువత ప్రజాస్వామ్య హక్కులు
యువతను అణచివేయడం ఏ ప్రభుత్వానికీ సాధ్యం కాదు
ప్రజా సమస్యలపై మరింత చురుగ్గా పనిచేయాలి
యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వేజండ్ల సాయికుమార్

కాకతీయ, ఖమ్మం టౌన్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యార్థి, యువజన వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వేజండ్ల సాయికుమార్ పిలుపునిచ్చారు. యువత శక్తిని జాతీయ నిర్మాణానికి వినియోగించడంతో పాటు నిరుద్యోగం, విద్య, సామాజిక న్యాయం, యువత హక్కులపై అవగాహన కల్పించడం యువజన కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఖమ్మం నగరంలోని జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సాయికుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరై యువజన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు.

యువత గొంతును అణచలేరు

ప్రభుత్వాన్ని ప్రశ్నించడం దేశద్రోహం కాదని, ప్రశ్నించడం, నిరసించడం, న్యాయం కోరడం యువతకు ఉన్న ప్రజాస్వామ్య హక్కులని సాయికుమార్ అన్నారు. దేశ యువత గొంతుకను అణచివేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. హింస, బెదిరింపులు, అణచివేతతో యువత హక్కులను కాలరాయడం సాధ్యం కాదన్నారు. నిరుద్యోగం నిర్మూలన, విద్యారంగ అభివృద్ధి, సామాజిక న్యాయం, యువత హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం యువజన కాంగ్రెస్ నిరంతరం పోరాటాలు కొనసాగిస్తుందని తెలిపారు. బీజేపీ ముసుగులో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలానికి యువత భయపడదని, నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటుందని అన్నారు. యువతను భయపెట్టలేరని, అణచలేరని స్పష్టం చేశారు.

ప్రజలకు అన్నదానం

జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సమీపంలో సాయికుమార్ ఆధ్వర్యంలో సుమారు 300 మందికి అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్‌ సెల్‌ ఉపాధ్యక్షులు బాలాజీ నాయక్‌, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు కొత్త సీతారాములు, శేఖర్ గౌడ్, బొడ్డు బొందయ్య, సయ్యద్ గౌస్, పుచ్చకాయల వీరభద్రం, జిల్లా జనరల్‌ సెక్రటరీలు కిల్లర్ అనిల్, గంగరాజు, బచ్చలకూర నాగరాజు, గాదెల ఝాన్సీ, బామ్మిడి శ్రీనివాస్, రంగా జనార్ధన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు షాహెల జావిద్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర సెక్రటరీ అంజన్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు బెజ్జం బాలగంగాధర్, బానోత్ కోటేష్, జిల్లా జనరల్‌ సెక్రటరీలు బెల్లంకొండ శరత్, కుక్కల మహేష్, అన్వేష్ గౌడ్, నెల్లూరి ఉపేందర్, బాలరాజ్, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ బెల్లం సాయి తేజ, నియోజకవర్గ ఉపాధ్యక్షులు అంబటి ఈశ్వర్, జంగం రాజేష్, నితీష్ కుమార్, కైసర్, ఆకాష్ నాయుడు, సాయి తేజ, ఖమ్మం టౌన్ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, టౌన్ ఉపాధ్యక్షులు సైదన్ రావు, సంపత్ నాయుడు, మండల అధ్యక్షులు రామకృష్ణ, నిమ్మల నాగేశ్వరావు, సతీష్, ముత్తారావు, యువజన కాంగ్రెస్ నాయకులు బోడిపూడి రాజా, పంది రాజు, దేవరకొండ రాజీవ్ గాంధీ, సాయి కుమార్, తోట నరేష్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.