ఎస్సైకి చిన్ననాగారం ఉపసర్పంచ్ సన్మానం
కాకతీయ, ఇనుగుర్తి : ఇనుగుర్తి మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన పి. నరేష్‌ను చిన్ననాగారం కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు, ఉపసర్పంచ్ తుమ్మనపల్లి సతీష్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్సై నరేష్‌ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు.

