epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జనసేనలోకి కరాటే ప్రభాకర్

జనసేనలోకి కరాటే ప్రభాకర్
కాంగ్రెస్‌ పార్టీలో 30 ఏళ్లు కృషి చేసినా గుర్తింపు లేదు
వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో మూడు ముక్కలాట
పదవులను సినిమా టికెట్లలా పంచుకుంటున్నారు
పవన్‌ కళ్యాణ్‌ సిద్ధాంతం నచ్చి జనసేనలో చేరాను
మీడియా స‌మావేశంలో కరాటే ప్రభాకర్ వెల్ల‌డి

కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి : కాంగ్రెస్‌ పార్టీలో మూడు దశాబ్దాలుగా పనిచేసినా తగిన గౌరవం, గుర్తింపు లభించలేదని ఆరోపిస్తూ ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు కరాటే ప్రభాకర్‌ రాజీనామా చేశారు. మంగళవారం వరంగల్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్‌ను వీడి జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి మూడు ముక్కలాటగా మారిందని ఆయన విమర్శించారు. కరాటే ప్రభాకర్‌ మాట్లాడుతూ.. గత 30 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ కోసం కష్టపడి పనిచేశానని తెలిపారు. పార్టీ అధికారంలో లేని సమయంలోనూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పార్టీ బలోపేతానికి కృషి చేశానన్నారు. అయినప్పటికీ ప్రస్తుతం పార్టీలో కష్టపడిన వారికి సరైన గుర్తింపు, గౌరవం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి మూడు ముక్కలాటగా మారిపోయిందని ఆరోపించారు.

పదవుల పంపకం సినిమా టికెట్లలా..

కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడికి పదవి ఇచ్చినా కనీస గౌరవం, గుర్తింపు లేకుండా కొందరు వ్యవహరిస్తున్నారని కరాటే ప్రభాకర్‌ ఆరోపించారు. తూర్పు నియోజకవర్గంలో వచ్చిన పదవులను ‘నీకు ఒకటి.. నాకు ఒకటి’ అన్న చందంగా సినిమా టికెట్ల మాదిరిగా పంచుకుంటున్నారని విమర్శించారు. తనను కూడా ఎన్నో విధాలుగా ఒత్తిళ్లకు గురిచేశారని, పార్టీ కోసం కష్టపడిన వారికి విలువ లేకుండా పోయిందని మండిపడ్డారు.
రానున్న రోజుల్లో వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు జనసేనలో చేరే అవకాశం ఉందని కరాటే ప్రభాకర్‌ తెలిపారు. తాను పవన్‌ కళ్యాణ్‌ కోసం మాత్రమే జనసేనలోకి రాలేదని స్పష్టం చేశారు. పేదలకు మంచి చేయాలనే పవన్‌ కళ్యాణ్‌ దృక్పథం, సిద్ధాంతం నచ్చడంతోనే జనసేనలో చేరుతున్నానని పేర్కొన్నారు. జనసేన అధిష్ఠానం ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా పనిచేస్తానని, పేద ప్రజల అభివృద్ధి కోసం తన శక్తి మేరకు కృషి చేస్తానని కరాటే ప్రభాకర్‌ తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.